తిరువతనంపురం: పండుగలు, వేడుకలకు కళ తీసుకువచ్చేదే ఆడవాళ్లు. మహిళలు లేకుండా జరిపే వేడుకలు జీవం లేకుండా కళావిహీనంగా ఉంటాయి. ఒకవేళ పురుషులే మహిళల్లా అలంకరించుకుని వేడుకలో పాల్గొంటే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ వీడియో. దీన్ని చూసిన వారంతా పగలబడి నవ్వుతున్నారు. కేరళ వారికి ఓనమ్ ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేరళ మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటారు. పండుగనాడు మహిళలు ప్రత్యేకమైన ఓనమ్ చీరను ధరించి.. ఓ చోట చేరి పువ్వులతో రంగవల్లులు వేసి.. నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఒకవేళ పురుషులు ఓనమ్ వేడుకల్లో పాల్గొంటే.. అది కూడా మహిళల్లా అలంకరించుకుని డ్యాన్స్ చేస్తే.. ఊహించుకుంటేనే బలే సరదాగా ఉంది కదా. ఇక ఇందుకు సంబధించిన వీడియోను చూస్తే.. నవ్వకుండా ఉండలేరు.
ఈ వీడియోలో కొందరు పురుషులు కేరళ మహిళల మాదిరి చీరను ముండు స్టైల్‌లో ధరించి.. మెడలో బంగారు ఆభరణాలు వేసుకుని.. తలపై పువ్వులు ధరించి ముస్తాబయ్యారు. అంతటితో ఊరుకోక ‘మనమెంతాయి’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. రాధికా తిలక్ నిర్మించిన స్నేహం చిత్రంలోని ఈ పాట కేరళ జానపద నృత్యం కైకొట్టి కాళి ప్రదర్శనలో పాడతారు. ఓనమ్, తిరువతీర వంటి వేడుకల సందర్భంగా కేరళ మహిళలు గుంపుగా చేరి ఈ కైకొట్టి కాళి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ వ్యక్తులు కూడా అదే పని చేశారు. వీడియో చూసిన వారు ఆఫీసులో మహిళా ఉద్యోగులు లేకపోతే.. ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment