ఓనమ్‌ పండుగకు ప్రత్యేక రైళ్లు | Indian Railways Announces Special Trains For Onam Festival | Sakshi
Sakshi News home page

ఓనమ్‌ పండుగకు ప్రత్యేక రైళ్లు

Published Sun, Sep 4 2022 1:58 AM | Last Updated on Sun, Sep 4 2022 1:58 AM

Indian Railways Announces Special Trains For Onam Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓనమ్‌ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరా­బాద్‌–­త్రివేండ్రమ్‌ (07119/07120) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 5న సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు త్రివేండ్రమ్‌ చేరుకోనుంది.

తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్‌ 10న రాత్రి 10 గంటలకు బయల్దేరి రెండో రోజు తెల్లవారు జామున 3 గంటలకు హైదరాబాద్‌ చేరుకో­నుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–­యశ్వంత్‌పూర్‌ (07159/07160) స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు ఈనెల 5న రాత్రి 8.25 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6వ తేదీ సాయంత్రం 5.20గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉద­యం 7గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement