నేత్రపర్వం | thvameva saranam sai programme in puttaparthy | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం

Published Wed, Oct 19 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

నేత్రపర్వం

నేత్రపర్వం

పుట్టపర్తి టౌన్‌ : కుచేలుని నిస్వార్థ భక్తి ప్రపత్తులను వివరిస్తూ చిన్నారులు ‘త్వమేవ శరణం సాయి’ అన్న పేరుతో నిర్వహించిన నృత్యరూపకం నేత్రపర్వంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి భక్తులు రెండవ రోజు బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుని బాల్య మిత్రుడైన కుచేలుడు ప్రదర్శించిన నిస్వార్థ భక్తిని వివరించడం ప్రధాన అంశంగా నృత్యరూపకం సాగింది. శ్రీకృష్ణుడు, కుచేలుని భక్తి ప్రపత్తుల గురించి అర్జునుడికి వివరించే ఘట్టంతో నృత్యప్రదర్శన ప్రారంభమైంది. నృత్యప్రదర్శనను తిలకించిన భక్తులు పరవశించిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement