ముగిసిన విశ్వశాంతి యజ్ఞం
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో విజయదశమి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. దేశవిదేశాలకు చెందిన మంది భక్తులు పాల్గొన్నారు. విశ్వశాంతి యజ్ఞ వేదిక వద్ద నుంచి రుత్వికులు వేదమంత్రోచ్చారణ నడుమ పూర్ణాహుతి సామగ్రి భరణిని చేతబూని ఊరేగింపుగా సత్యసాయి మహాసమాధి చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కందుకూరి కొండావధాని నేతత్వంలోని రుత్వికుల బందం పూర్ణాహుతితో విశ్వశాంతి యజ్ఞాన్ని పూర్తి చేశారు. దుర్గాదేవిని కీర్తిస్తూ భక్తులు భక్తిగీతాలతో పూర్ణచంద్ర ఆడిటోరియం మార్మోగింది.
సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. పలువురు వక్తలు సత్యసాయి వైభవాన్ని, దసరా పర్వదిన విశిష్టతను, అమ్మవారి వైభవాన్ని వివరించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సవితా నరసింహన్, కుమారి స్వర్ణలతా, గణపతిరామన్‌లతో కలసి నిర్వహించిన సంగీత కచేరి అందరినీ ఆకట్టుకుంది. ³#ట్టపర్తి,బుక్కపట్నం,కొత్తచెరువు మండలాల్లోని 126 గ్రామాలలో సత్యసాయి విద్యార్థులు చేపట్టిన గ్రామ సేవ కార్యక్రమం ముగిసింది.