
వైభవంగా సత్యసాయి పల్లకీ ఉత్సవం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిపై భక్తిప్రపత్తులు చాటుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సత్యసాయి భక్తులు గురువారం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పర్తియాత్రలో భాగంగా సుమారు 500 మంది విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో సత్యసాయిపల్లకీ ఉత్సవం నిర్వహించారు.
ప్రశాంతి నిలయంలోని సత్యసాయి భక్తనివాస్ నుంచి సత్యసాయి పల్లకీని ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ ఉత్సవం చేపట్టారు. పట్టణ పురవీధుల గుండా పల్లకీ ఉత్సవం శివాలయం వరకు సాగింది. వారు ఇంకా మూడు రోజుల పాటు ప్రశాంతి నిలయంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.