రాక్షస పాలనకు చరమగీతం పాడదాం | mlc vennapusa gopalreddy pressmeet in puttaparthy | Sakshi
Sakshi News home page

రాక్షస పాలనకు చరమగీతం పాడదాం

Published Tue, Mar 28 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

రాక్షస పాలనకు చరమగీతం పాడదాం

రాక్షస పాలనకు చరమగీతం పాడదాం

పుట్టపర్తి టౌన్‌ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసి రౌడీయిజానికి, అవినీతికి వంతపాడుతూ రాక్షసపాలన కొనసాగిస్తున్నారని, ఇలాంటి దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తిలోని స్థానిక సాయిఆరామంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పుష్ఫగుచ్చంతో అభినందించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఉపాధ్యాయులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈసందర​ంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్య పాలనతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలను అటకెక్కించిన ఆయన రైతు, చేనేత, డ్రాక్రా రంగాలను సంక్షోభంలోకి నెట్టారని వివర్శించారు

సంక్షేమ పథకాలకు పైసా విదల్చకుండా బడుగు బలహీన వర్గాలను వంచిస్తున్నాడన్నారు. టీడీపీ నాయకులు మహిళలపైనా,అధికారులపైనా దాడులకు తెగబడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తిగా వెనుకబడ్డాయని, చట్టసభల్లో ఈ ప్రాంతం సమస్యలపై పోరాడాలని కోరారు. పుట్టపర్తి నియోజకర్గంలో ఉపాధి లేక గ్రామీణులు కేరళ, బెంగళురుకు వలస పోతున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చోద్యం చూస్తున్నారన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ట్రేడ్‌యునియన్‌ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌ పీరా, సహకార సంఘం అధ్యక్షులు ఏవీరమణారెడ్డి, నరసారెడ్డి, విశ్రాంత ఎంఈఓ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి పట్టణ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, రాంజీనాయక్, ఈశ్వరయ్య, నాయకులు చెరువు భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బీరే నారాయణ, రైల్వేభాస్కర్, గోపాల్‌రెడ్డి, గాజుల వెంకటేష్, శ్రీరాములు, సాయిరాంరెడ్డి, రామిరెడ్డి, శివప్ప, జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ తిప్పారెడ్డి, హనుమంతరెడ్డి, సాయినాథ్‌యాదవ్, ఆదినారాయణరెడ్డి, దాసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గంగాద్రి, రఘు, గోవర్దన్‌రెడ్డి, నాగమల్లేశ్వర్‌రెడ్డి, ఓబిరెడ్డి, పతాంజలి, రఫీ, రంగారెడ్డి, రఘు, బాలాజీనాయక్, చిన్నా,ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement