mlc vennapusa gopalreddy
-
సమస్యల పరిష్కారంలో ఏన్జీవో నేతలు విఫలం
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అబద్ధాలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక చెప్పటానికి అబధ్ధాలే లేకుండా పోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఏన్జీవో సంఘం ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ సమస్యలను వదిలేశారని ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో సంఘం పట్టించుకోలేదని, కేవలం 4 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నారావారి పల్లె నుండి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవసాయం పూర్తిస్ధాయిలో పడిపోయిందన్నారు. సంఘాలకు ప్రశ్నించే తత్వం లేకుండా పోయిందని, నాలుగేళ్ళలో ఒక్క నోటీసు కానీ, ధర్నా కాని చేసిన పాపాన పోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అభివృధ్ధికి అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు మీరు ఏ అభివృధ్ధి చేస్తే ఆయన అడ్డుపడ్డారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుణమాఫీ దగ్గర నుండి పోలవరం వరకు ఏ ఒక్క అంశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమేనని సవాల్ విసిరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఆల్ఫ్రెడ్, నాగరాజు, అంజిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలపై చర్యలు తీసుకోండి
అనంతపురం అర్బన్: రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో భారీ అవినీతి చోటు చేసుకుందని, గ్రామ పొలాల్లో రాళ్ల గుట్టలకు 56 మంది అడంగల్, 1–బిలో పేర్లు నమోదు చేసుకుని, వాటితో కోట్ల రూపాయల్లో పంట రుణాలు తీసుకున్నారని కలెక్టర్ జి.వీరపాండియన్‌కి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం కలిసి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 14 సర్వేనెంబరులో 25.12 ఎకరాలు రాళ్ల గుట్ట ఉందన్నారు. దీనికి సబ్లెటర్లు సృష్టించి ఒక్కొక్కరికీ 5 ఎకరాల చొప్పున 33 మందికి పట్టాలు ఇచ్చారన్నారు. అలాగే 261,407, 406, 51 సర్వేనెంబర్లకు లెటర్లు సృష్టించి పట్టాలు చేసుకున్నారన్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలకు దొంగపట్టాలు పొంది వాటితో కెనరా బ్యాంక్‌లో రూ.కోట్ల పంట రుణాలు పొందారన్నారు. వీటిని అడ్డంపెట్టుకుని ఇన్పుట్ సబ్సిడీని కూడా స్వాహా చేశారన్నారు. దీంతో నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గొందిరెడ్డిపల్లితో పాటు మండలంలోనూ చాలా మంది దొంగ పాసుపుస్తకాలు పొందారన్నారు. ప్రభుత్వ భూములు, శ్మశానాలను ఆక్రమించి బ్యాంకులో తాకట్టుపెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి తక్షణం రికవరీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చెన్నారెడ్డి, ఎంపీటీసీలు గోవిందరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ కన్వీనర్ నాగేశ్వరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, నాయకులు ఎర్రగుట్ల కేశవరెడ్డి, హంపాపురం సింగారెడ్డి, బీసీ సెల్ నాయకుడు లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు. -
గుక్కెడు నీరివ్వలేరా?
- నిలదీసిన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు - వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కార్యాలయ ముట్టడి - ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూసతో పాటు పలువురు నాయకుల అరెస్ట్ - ప్రజల దాహార్తి తీర్చలేని చేతగాని ప్రభుత్వమంటూ విశ్వ మండిపాటు అనంతపురం సిటీ : తాగునీటి సమస్యపై ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు కదంతొక్కారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే, పోలీసులు అప్పటికే కార్యాలయానికి తాళం వేసి.. భారీగా మోహరించారు. పీఏబీఆర్ వద్దనున్న తాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు వదలకుండా తాళం వేసుకుంటారా అంటూ పాలకులపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఖాళీబిందెలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి కూడా హాజరై.. సంఘీభావం ప్రకటించారు. ఆందోళనను ఉద్దేశించి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు గుక్కెడు నీరు కూడా ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వమిది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఏబీఆర్ వద్ద 2013లో ఉరవకొండ నియోజకవర్గంలోని 90 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చడం కోసం చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుకు రూ.56 కోట్ల నిధులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అప్పుడే 99 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 2015 నవంబరు నాటికి పూర్తి కావాల్సిన ఒక శాతం పనులను టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరికి పూర్తి చేసిందన్నారు. అయినా ప్రాజెక్టు నుంచి గ్రామాలకు నీటిని సరఫరా చేయకుండా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అడ్డు పడుతున్నారని విమర్శించారు. ఇదేమీ ఒక్క కేశవ్ కుటుంబ సమస్య కాదన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ప్రాజెక్టును నిరుపయోగం చేయాలని చూస్తే జనం సహించబోరని హెచ్చరించారు. అభివృద్ధికి ఆటంకంగా మారడం ద్వారా కేశవ్ రాజకీయ జీవిత పతనం మొదలైందన్నారు. ప్రాజెక్టును ప్రారంభించాలంటూ గత నెల 13న కార్యాలయాన్ని ముట్టడించామని, 14న మంత్రి కాలవ శ్రీనివాసులును కూడా కలిశామని గుర్తు చేశారు. 15న కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రాజెక్టును సందర్శించినా స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను వేసిన రోడ్డులో నడుస్తూ.. తానిచ్చే పింఛన్లతో తింటూ టీడీపీకి ఓటు వేయకుంటే ఎలా అంటూ బెదిరింపులకు దిగుతున్న చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పిచ్చాస్పత్రి లేనందున కేసీఆర్‌తో మాట్లాడి హైదరాబాద్‌లోని యర్రగడ్డ ఆస్పత్రిలో చంద్రబాబును చేర్చాల్సిందేనన్నారు. పోలీసుల ఓవరాక్షన్... ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కలిసేందుకు అవకాశం ఇవ్వండి.. లేదంటే వారినే ఇక్కడకు రమ్మనండి అని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు కోరినా పోలీసు అధికారులు స్పందించలేదు. వందల సంఖ్యలో వచ్చిన పోలీసులు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నేతలకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం అరెస్టయిన వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో కూడేరు జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖర్, సర్పంచులు రామకృష్ణ, వెంకటరమణ, కిష్టప్ప, అంజమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉద్యోగులందరికీ పెన్షన్ వర్తింపజేస్తాం
కదిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగులందరికీ పెన్షన్ వర్తింపజేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడామన్నారు. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో లాగానే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుచేస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికో ఉద్యోగమిస్తానని హామీ ఇచ్చారని, అలా ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఇప్పటి దాకా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన పీఆర్సీ, డీఏల విషయంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. కాపులను బీసీ జాబితాలో, రజకులను, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వీటన్నింటిపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఆర్వేటి శాంతమ్మ, కౌన్సిలర్ రాజశేఖర్‌రెడ్డి,గాండ్లపెంట మండల కన్వీనర్ చంద్రారెడ్డి, నాయకులు గజ్జల రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు జంషీద్, శ్రీనివాసరెడ్డి, మనోహర్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాక్షస పాలనకు చరమగీతం పాడదాం
పుట్టపర్తి టౌన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసి రౌడీయిజానికి, అవినీతికి వంతపాడుతూ రాక్షసపాలన కొనసాగిస్తున్నారని, ఇలాంటి దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తిలోని స్థానిక సాయిఆరామంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పుష్ఫగుచ్చంతో అభినందించారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు, ఉపాధ్యాయులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈసందరంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్య పాలనతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలను అటకెక్కించిన ఆయన రైతు, చేనేత, డ్రాక్రా రంగాలను సంక్షోభంలోకి నెట్టారని వివర్శించారు సంక్షేమ పథకాలకు పైసా విదల్చకుండా బడుగు బలహీన వర్గాలను వంచిస్తున్నాడన్నారు. టీడీపీ నాయకులు మహిళలపైనా,అధికారులపైనా దాడులకు తెగబడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తిగా వెనుకబడ్డాయని, చట్టసభల్లో ఈ ప్రాంతం సమస్యలపై పోరాడాలని కోరారు. పుట్టపర్తి నియోజకర్గంలో ఉపాధి లేక గ్రామీణులు కేరళ, బెంగళురుకు వలస పోతున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చోద్యం చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ట్రేడ్యునియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా, సహకార సంఘం అధ్యక్షులు ఏవీరమణారెడ్డి, నరసారెడ్డి, విశ్రాంత ఎంఈఓ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ పుట్టపర్తి పట్టణ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, రాంజీనాయక్, ఈశ్వరయ్య, నాయకులు చెరువు భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బీరే నారాయణ, రైల్వేభాస్కర్, గోపాల్‌రెడ్డి, గాజుల వెంకటేష్, శ్రీరాములు, సాయిరాంరెడ్డి, రామిరెడ్డి, శివప్ప, జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ తిప్పారెడ్డి, హనుమంతరెడ్డి, సాయినాథ్‌యాదవ్, ఆదినారాయణరెడ్డి, దాసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గంగాద్రి, రఘు, గోవర్దన్‌రెడ్డి, నాగమల్లేశ్వర్‌రెడ్డి, ఓబిరెడ్డి, పతాంజలి, రఫీ, రంగారెడ్డి, రఘు, బాలాజీనాయక్, చిన్నా,ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస
అనంతపురం అర్బన్ : పట్టభద్ర ఎమ్మెల్సీగా ఎన్నికైన వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం కలెక్టర్ కోన శశిధర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారంటూ ధన్యావాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈయన వెంట జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.