
తన్మయభరితం ‘శుభోదయం’
పుట్టపర్తి టౌన్: విశాఖ జిల్లా బాలవికాస్ చిన్నారులు శ్రీకృష్ణుని లీ లలను,సత్యసాయి వైభవాన్ని వివరిస్తూ నిర్వహించిన నృత్యప్రదర్శ న తన్మయభరితంగా సాగింది. గురువారం సాయంత్రం ప్రశాంతి నిలయంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించారు. తొలుత విశాఖపట్నం జిల్లా సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసా యి ఆదర్శాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ మార్గాన్ని రూపొం దించుకోవాలన్నారు. సత్యసాయి సేవా కార్యక్రమాల మూలంగా వి శాఖపట్నం జిల్లాలోని మారుమాల గ్రామాలకు చెందిన పేదలు ఎం తో లబ్ధి పొందారన్నారు.
సత్యసాయి సేవా సంస్థల ద్వారా అంది స్తున్న విద్య, వైద్యం, తాగునీరు ఎందరో పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయన్నారు. అనంతరం బాలవికాస్ విద్యార్థులు, సత్యసాయి యూత్ సభ్యులు విశాఖ సంస్కృతినిప్రతిబింబిస్తూ, కృష్ణుని వైభవాన్ని వివరిస్తూ నృత్యప్రదర్శన నిర్వహించారు. చిన్నారులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు దంపతులు జ్ఞాపికలను అందజేశారు. చివరగా విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.