పుట్టపర్తి ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ | puttaparthy si and head constable suspension | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

Published Fri, Jun 9 2017 11:12 PM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM

puttaparthy si and head constable suspension

అనంతపురం సెంట్రల్‌ : పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటరాముడును సస్పెండ్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రాజశేఖరబాబు ఇచ్చిన నివేదికల ఆధారంగా డీఐజీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పుట్టపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యాయత్నం కేసులను కూడా పంచాయితీలు పెట్టి సెటిల్‌మెంట్‌ చేస్తున్నారనే అభియోగాలు వచ్చాయి. కొంతమంది బాధితులు కూడా నేరుగా వచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ లోతుగా విచారించారు. విచారణలో ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో నివేదికను డీఐజీకి పంపించగా, ఆయన సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement