
ముగిసిన చైనీస్ సంవత్సరాది వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సరాది వేడుకలు శనివారం ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో బౌద్ధ సంప్రదాయం మేరకు జాలి.. దయను స్మరించే డా బీ జో మంత్రాన్ని సత్యసాయి మహాసమాధి చెంత జకార్తాకు చెందిన భక్తులు పఠించారు.
సత్యసాయి అంతర్జాతీయ సేవా సంస్థలకు చెందిన సీనియర్ ఆఫీస్‌బ బేరర్ బోర ఉస్‌లీ ప్రసంగించారు. తన జీవితంతో ఆధ్యాత్మిక చింతనతో పొందిన అనుభూతులను వివరించారు. అనంతరం ఇద్దరు యువకులు హార్మోనిక్ వాయిద్య ప్రదర్శన నిర్వహించారు. ఇండోనేషియాకు చెందిన మహిళా భక్తులు వర్ణరంజితమైన వేషధారణలో నూతన సంవత్సర గీతాన్ని ఆలపించారు.