
ఘనంగా సిమ్స్ వైట్‌ఫీల్డ్ 16 వార్షికోత్సవం
పుట్టపర్తి టౌన్ : బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ 16వ వార్సికోత్సవం ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ఘనంగా జరిగింది. సత్యసాయి మహాసమాధి చెంత సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సుందరేషన్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ఆశీస్సులతోనే వైట్ ఫీల్డ్ సిమ్స్‌లో వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. ప్రేమ,సేవా భావంతో కూడిన వైద్య విధానాన్ని సత్యసాయి ప్రవేశపెట్టారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ అక్కడ వైద్య సేవలను కొనసాగిస్తున్నామన్నారు.
పిదప పలువురు వైద్యులు వారి విభాగాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, వైద్య సేవలు తమ అనుభవాలను వివరిస్తూ ప్రసంగించారు. అదేవిధంగా 16 సంవత్సరాలుగా సిమ్స్ ద్వారా అందించిన చికిత్సలను విభాగాల వారిగా వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అమితంగా అకట్టుకున్నారు. పిదప సిమ్స్ వైట్‌ఫీల్డ్ సిబ్బంది సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జె.రత్నాకర్‌రాజు, చక్రవర్తి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.