నేటి నుంచి మహిళా సదస్సు
పుట్టపర్తి టౌన్ : సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడం కోసం సత్యసాయి దేశీయ సేవా సంస్థల ఆధ్వర్యంలో శనివారం నుంచి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో అఖిలభారత మహిళా సదస్సు జరగనుందని మీడియా కో–ఆర్డినేటర్ శుక్రవారం తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 4 వేల మంది మహిళా ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. సదస్సును ప్రముఖ పారిశ్రామికవేత్త, భోపాల్ మహిళా న్యాయ కళాశాల డైరెక్టర్ మీనా ప్రారంభించనున్నారు.
ప్రధానంగా సత్యసాయి బోధనలకు అనుగుణంగా మహిళా లోకానికి మార్గనిర్దేశనం చేసే లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం జాతీయ కోఆర్డినేటర్ కమలాపాండ్యతో పాటు నీతా ఖన్నా మహిళా ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించనున్నారు.