
అలరించిన సాయి విద్యార్థుల సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : పర్తిసాయిపై తమకున్న భక్తి, కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రంనిర్వహించిన సంగీత కచేరి అలరించింది. సత్యసాయి మహా సమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరిపింపజేశారు.