సత్యసాయి సేవలు వెలకట్టలేనివి | telangana assembly speaker in puttaparthy | Sakshi
Sakshi News home page

సత్యసాయి సేవలు వెలకట్టలేనివి

Published Fri, Feb 24 2017 9:23 PM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM

సత్యసాయి సేవలు వెలకట్టలేనివి - Sakshi

సత్యసాయి సేవలు వెలకట్టలేనివి

పుట్టపర్తి టౌన్‌ : సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి కొనియాడారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక కాన్వాయ్‌లో బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన చేరుకున్న ఆయనకు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్‌ అతిథి గృహం వద్ద సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ వర్గాలు, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ వసంత్‌కుమార్, డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి, సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు రూ.వందల కోట్లు ఖర్చు చేసి తాగునీటిని అందించిన మహానుభావుడు సత్యసాయి అని కొనియాడారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆయన సేవలు ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement