'ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇస‍్తున్నాం'
Published Wed, Mar 22 2017 1:01 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్ : శాసనసభలో ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటున్నామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా సభ నడుస్తుందన్న విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై స్పీకర్ బుధవారం ఉదయం స్పందించారు. పద్దులపై మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు అన్నుకున్న దాని కంటే ఎక్కువ సమయమే ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత పట్ల అందరికీ అపారమైన గౌరవం ఉందన్నారు. జానారెడ్డి పట్ల తమకు గౌరవం ఉన్నదని సీఎం కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు.
టీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. తమకు సమయం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. నిన్న సభలో అధికార పక్షం కన్నా.. విపక్షాలకు అధిక సమయం కేటాయించామని తెలిపారు. సభలో అందరూ హుందాగా వ్యవహరించాలన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.
Advertisement
Advertisement