పుట్టపర్తి టౌన్ : మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీరుపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ డైరెక్టర్ల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించకుండా మంత్రి నిర్లక్ష్యం చేయడం వల్లే పుట్టపర్తి సహకార సంఘం రద్దయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరపంచాయతీ చైర్మన్ పీసీ.గంగన్న, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నకేశవులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ముమ్మనేని వెంకటరాముడు, డైరెక్టర్లు నరసింహులు, బండారు చెన్నప్ప, వెంకటరాముడు తదితరులు మాట్లాడారు.
సహకారం సంఘంలో ఏడుగురు టీడీపీ, ఆరుగురు వైఎస్సార్‌సీపీ డైరెక్టర్లు ఉన్నారన్నారు. గత ఏడాదిగా టీడీపీ డైరెక్టర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకే మంత్రి ప్రాధాన్యత ఇస్తుండటంతో విభేదాలు పరిష్కారం కాకుండాపోయాయన్నారు. ఇద్దరు, ముగ్గురు నాయకుల చెప్పుడు మాటలు వింటూ మంత్రి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. సహకార సంఘం పాలకవర్గం రద్దుకు మాజీ అధ్యక్షుడు గూడూరు ఓబిలేసు ప్రధాన కారకుడన్నారు.
‘పల్లె’ తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి
Published Sat, Apr 1 2017 12:14 AM | Last Updated on Thu, Mar 28 2019 6:27 PM
Advertisement
Advertisement