
ఘనంగా చైనీస్ నూతన సంవత్సర వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధి, ప్రశాంతి నిలయాన్ని చైనా సాంప్రదాయ రీతిలో అలంకరించారు. చైనా, థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా దేశాలకు చెందిన వేలాది భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత వేదమంత్రోచ్ఛారణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
సత్యసాయి భక్తుడు బిల్లీ ఫాంగ్ ప్రసంగిస్తూ చైనా సంప్రదాయం ప్రకారం వరుస క్రమంలో ఈఏడాది సమయపాలనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సత్యసాయి దశావతారాలను వివరిస్తూ బిల్లీ ఫాంగ్ పుస్తకాన్ని అవిష్కరించారు. మహిళా భక్తురాలు ఇసాబెల్లా మాట్లాడారు. వేడుకలతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది.