టీడీపీ ఖాళీ కావడం ఖాయం | pc ganganna strikes against government | Sakshi
Sakshi News home page

టీడీపీ ఖాళీ కావడం ఖాయం

Published Sun, Jun 25 2017 11:16 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

టీడీపీ ఖాళీ కావడం ఖాయం - Sakshi

టీడీపీ ఖాళీ కావడం ఖాయం

పుట్టపర్తి టౌన్‌ : తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలను సస్పెండ్‌ చేస్తూ పోతే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఖాళీ కావడం ఖాయమన్న  విషయాన్ని మాజీ మంత్రి పల్లెతో పాటు పార్టీ పెద్దలు గుర్తించాలని టీడీపీ బహిష్కృత నేత, నగర పాలక చైర్మన్‌ పి.సి.గంగన్న తెలిపారు. ఆదివారం తన అనుచరులతో కలిసి పట్టణంలోని హనుమాన్‌ సర్కిల్‌లో ఆయన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ‘పల్లె వద్దు.. గంగన్న ముద్దు’ అంటూ నినాదాలు రాసిన ప్ల కార్డులను ప్రదర్శించారు.

అనంతరం గంగన్న మాట్లాడుతూ  పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన  తనను సస్పెండ్‌ చేయడం దురదృష్టకరమన్నారు. పుట్టపర్తి నగర పంచాయతీలో అభివృద్ధి జరగకుండా మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తనతో పాటు  పార్టీ కోసం పనిచేసే దాదాపు  10 మంది కార్యకర్తలను సస్పెండ్‌ చేశారని గుర్తుచేశారు. ఇలా సస్పెండ్‌ చేస్తూ పోతే పార్టీ ఖాళీ అయిపోయి ఒక్క పల్లె మాత్రమే మిగులుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement