ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు.
పుట్టపర్తి అర్బన్ : ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. జనవరి తొమ్మిదో తేదీన గువ్వలగుట్టపల్లికి చెందిన శ్రీరాములు, శ్రీనివాసులు, నరసప్పలు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన ద్వార తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. స్వామి వారి వెండి, పంచలోహ, ఇత్తడి ఆభరణాలను అపహరించుకుపోయారు.
పూజారి వెంకటాచలపతి ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం ఆభరణాలను గోరంట్లలో విక్రయించడానికి వెళుతున్న ముగ్గురు దొంగలనూ బస్టాండ్‌లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచారు.