ఎస్‌బీఐకి నగదు తీసుకెళుతున్న కారు బోల్తా | cash van rolls | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐకి నగదు తీసుకెళుతున్న కారు బోల్తా

Published Fri, Jul 7 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

ఎస్‌బీఐకి నగదు తీసుకెళుతున్న కారు బోల్తా

ఎస్‌బీఐకి నగదు తీసుకెళుతున్న కారు బోల్తా

పుట్టపర్తి అర్బన్‌ : గోరంట్ల ఎస్‌బీఐ బ్రాంచ్‌కి నగదు తరలించే కారు పుట్టపర్తి మండలం పెడపల్లి ఈద్గా మలుపు వద్ద శుక్రవారం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులుకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అద్దెకు కారు తీసుకుని గోరంట్ల నుంచి తాడిపత్రికి నగదు తీసుకురావడానికి ఇద్దరు సెక్యూరిటీతో కలసి మరో ఇద్దరు ఉద్యోగులు వెళ్లినట్లు గోరంట్ల ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు చెప్పారు.

నగదు తీసుకొని తిరిగి వస్తుండగా పెడపల్లి దాటి ఈద్గా మలుపు వద్దకు రాగానే టైరులో ఇనుప మేకు గుచ్చుకుని పంక్చరైంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోకి బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గోరంట్ల మేనేజర్‌కు సమాచారం అందించగానే ప్రత్యేక వాహనం తీసుకొచ్చి సిబ్బందిని సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. నగదు పెట్టెను మరో కారులో గోరంట్ల ఎస్‌బీఐ బ్రాంచ్‌కు తీసుకెళ్లారు. రూరల్‌ ఏఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement