
సాక్షి, గుంటూరు: చంద్రబాబు తనను తిట్టడానికే పర్యటన పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. రైతు సమస్యలపై బాబుకు, పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. రైతులకు సాయం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ ఒకే పాట పదే పదే పాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి ఈమేరకు మాట్లాడారు.
చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..