చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.
బిలాస్పూర్: చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. నిర్లక్ష్యం, అవినీతి, నకిలీ మందుల కారణంగా మహిళల మరణించారని రాహుల్ విమర్శించారు. బిలాస్పూర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు.
బిలాస్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.