అనంతపురం టౌన్ : బ్యాంకులన్నీ మూతపడిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రష¯Œ్స శాఖలో బుధవారం రిజిసే్ట్రషన్లు అమాంతం తగ్గిపోయాయి. అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రోజూ సుమారు 700 నుంచి 800 వరకు డాక్యుమెంట్లు రిజిసే్ట్రష¯ŒS అయ్యేవి. అయితే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. వందకు మించి రిజిసే్ట్రషన్లు కాలేదు. యాడికి, కణేకల్లు వంటి గ్రేడ్–2 కార్యాలయాల్లో అసలు రిజిసే్ట్రష¯ŒS ప్రక్రియే ప్రారంభం కాలేదు.
బ్యాంకులు కూడా మూసివేయడంతో చలానాలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందే చలానా కట్టినవారు మాత్రమే కార్యాలయాలకు వచ్చి తమ పనులు చేసుకుని వెళ్లారు. బ్యాంక్ రుణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒక్కరోజే సుమారు రూ.50 లక్షల వరకు శాఖ ఆదాయాన్ని కోల్పోయింది. అనంతపురం రిజిసే్ట్రష¯ŒS కార్యాలయంలో రోజూ 70 డాక్యుమెంట్ల రిజిసే్ట్రష¯ŒS జరిగేవి. బుధవారం మాత్రం 15కు మించలేదని సబ్ రిజిస్ట్రార్ తాయన్న తెలిపారు. రూరల్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్క రిజిసే్ట్రష¯ŒSకు కూడా అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్లు ఢమాల్
Published Wed, Nov 9 2016 11:45 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement