regestrations
-
లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబో మంటున్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం..హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీ తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో నాలుగు జిల్లాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో ఇళ్ల రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో 25 శాతం తగ్గి 5,146 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో రెండవ సారి రిజిస్ట్రేషన్ ఖర్చులు (ఫిబ్రవరి1, 2022 నుండి అమలులోకి రిజిస్ట్రేషన్/మార్కెట్ విలువలలో అప్‌వర్డ్ రివిజన్) పెరగడం, గృహాల విక్రయాలు మందగించాయని తెలిపింది. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడం వల్ల రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఈ కేటగిరీలో అమ్మకాల రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 2021లో 2,888 యూనిట్ల నుండి 2022 ఫిబ్రవరిలో కేవలం 844 యూనిట్లకు తగ్గాయి. ఫిబ్రవరి 2022లో నాలుగు జిల్లాలకు సంబంధించి మొత్తం విక్రయాలు 25శాతం తగ్గాయి. హైదరాబాద్ జిల్లా విక్రయాల రిజిస్ట్రేషన్లలో 64 శాతం పడిపోయిందని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో తెలిపింది. రిజిస్ట్రేషన్ డేటా ద్వారా ప్రతిబింబించే విధంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు లావాదేవీ ధర ఫిబ్రవరి 2022లో 21 శాతం పెరిగింది. ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా అమ్మకాల ధరల పెరుగుదల పరంగా దేశంలోని బలమైన నివాస మార్కెట్లలో హైదరాబాద్ ఉంది. అయితే ఒమిక్రాన్ వైరస్ కారణంగా జనవరిలో కార్యాచరణ పరిమితులు, ఫిబ్రవరిలో ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా రూ. 25 లక్షల కంటే తక్కువ కేటగిరీలో ఉన్న ఇళ్లపై కొనుగోలు దారుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని, ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది వ్యవధిలో రిజిస్ట్రేషన్ల వేగం సాధారణ స్థితికి చేరుకుంటాయని బైజల్ అంచనా వేశారు. చదవండి: రియల్ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడుల వరద -
రవాణాశాఖలో స్తంభించిన సేవలు
జిల్లా రవాణా శాఖ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. సేవలు స్తంభించడంతో వివిధ పనులపై ఆఫీస్‌కు వచ్చిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజూ తిరగలేక.. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్టీఏలో ఇటీవలి వరకు ఏజెంట్ల హవా కొనసాగగా.. తాజాగా ఓ సంఘం నేత జోక్యంతో గందరగోళంగా మారింది . తమ మీదకు ఏం వస్తుందో.. ఏం జరుగుతుందోననే భయంతో పలువురు ఉద్యోగులు సెలవులపై వెళ్లారు. దీంతో వాహన రిజిస్ట్రేషన్లలో ఆటంకంతోపాటు లైసెన్స్‌ల జారీ కూడా తూతూమంత్రంగానే సాగుతోంది. ఫిట్నెస్, తనిఖీల వంటి పనులన్నీ స్తంభించాయి. సాక్షి, మెదక్: రవాణా శాఖలో ప్రస్తుతం ఆన్లైన్ ద్వారానే కార్యకలాపాలు సాగుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఇతరత్రా పనులు కావాలంటే ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇదంతా సులువు కాదు.. ఈ నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వారు వివిధ పనుల నిమిత్తం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. మెదక్‌లో ఇటీవల వరకు ఏజెంట్ల హవా కొనసాగింది. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. ఎవరైనా సరే వారు చెప్పిన మొత్తం కట్టాల్సిందే. లేదంటే వారి పని ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఉదాహరణకు ఫోర్ వీలర్ వాహన రిజిస్ట్రేషన్ డైరెక్ట్‌గా అయితే రూ.2 వేలు అవుతుంది. అదే ఏజెంట్ల వద్ద రూ.8 వేల వరకు అప్పజెప్పాల్సిందే. ఎలాంటి పత్రం లేకున్నా అధికారులతో కుమ్మక్కు కావడంతో ఫైల్ ముందుకు కదలడంతోపాటు చకచకా పని పూర్తవుతుంది. సదరు వాహన యజమాని డైరెక్ట్‌గా ఆర్టీఏ కార్యాలయానికి పోతే ఈ పత్రం లేదు.. అది కరెక్ట్‌గా లేదంటూ తిప్పి పంపడం మామూలు విషయం. వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఏజెంట్లు ఒక్కటై అధికారులు, సిబ్బందికో రేటు ఫిక్స్ చేసి ప్రజలను నిలువునా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ సంఘం నేత బెదిరింపులతో.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఒక సంఘం నేతగా చెప్పుకొంటూ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిలింగ్ చేసి డబ్బులు గుంజేవాడు. ఈ క్రమంలో సంఘం నుంచి అతడిని వెలివేశారు. ఆ తర్వాత ఆయన కన్ను రావాణా శాఖపై పడింది. మెదక్ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏజెంట్ల కార్యకలాపాలు.. వ్యవహారాలపై దృష్టి సారించారు. అందులో జరుగుతున్న అవినీతి, అధికారులు, సిబ్బందికి అందుతున్న ముడుపులపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. స్థానిక అధికారులు, సిబ్బందిపై ఇటీవల ఒత్తిడి పెంచడంతో వారు కలవరానికి గురయ్యారు. ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయండని ఏజెంట్లకు అధికారులు సూచించారు. ఏజెంట్లందరూ సమావేశమై కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత సదరు సంఘం నాయకుడికి తమ ఆఫర్‌ను తెలపగా సరిపోదని, పెంచాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ పంచాయితీ తెగకపోవడంతో ఏజెంట్లు తమ దందాను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయంతో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు సెలవుల్లోకి వెళ్లారు. విధుల్లో డీటీఓ, క్లర్క్ మాత్రమే.. ఆర్టీఓ కార్యాలయానికి రోజుకు రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు, రెన్యూవల్స్, పేరు మార్పిడి వంటి వివిధ పనులకు వందలాది మంది వస్తుంటారు. ఆర్టీఓ కార్యాలయంలో డీటీఓ, ఇద్దరు ఎంవీఐలు, ఇద్దరు ఏఎంవీఐలు, ఒక ఏఓ, ఇద్దరు యూడీసీలు, ఇద్దరు జూనియర్ క్లర్క్స్ ఉండాలి. ప్రస్తుతం డీటీఓ, ఒక క్లర్క్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం సరిపోనూ సిబ్బంది లేకపోవడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాహనదారులు రోజుల తరబడి ఆర్టీఓ కార్యాలయానికి చక్కర్లు కొడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణచార్జీ లు భారం కావడంతో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొం టున్నారు. ప్రస్తుతం అంతంత మాత్రమే.. వాహన లైసెన్స్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి రోజుకు సమారు 150 చొప్పున మొత్తం 300 స్లాట్లు బుక్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో వాహనదారులు రాకున్నా.. సుమారు 150 నుంచి 175 మంది వరకు వచ్చేవారు. వాటిని ఆర్టీఏ అధికారులు క్లియర్ చేసేవారు. ప్రస్తుతం 50 నుంచి 70 వరకు మాత్రమే క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రక్షాళన చేయాలి.. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌ల వంటి ప్రక్రియకు సంబంధించి సామాన్యులకు అవగాహన అంతంతే. పాత కాలం నాటి అధికారులు, సిబ్బందికి సైతం పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఈ క్రమంలో వాహనదారులతో పాటు ఆర్టీఓ అధికారులు ఏజెంట్లపై ఆధారపడాల్సి వస్తోంది. దళారుల నుంచి రోజువారీగా మామూళ్లు అందుతుండడంతో అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఏజెంట్ల వ్యవస్థ రద్దయినప్పటికీ వారి వైపే మొగ్గుచూపుతున్నారు. మెదక్‌లో ప్రస్తుతం ఏజెంట్లు రాకపోవడంతో సేవలు స్తంభించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయాలని వాహనదారులు కోరుతున్నారు. తిప్పుకొంటున్నారు.. టాటా ఏస్ వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చా. ఏజెంట్ దగ్గరికెళ్తే రూ.8 వేలు అడిగాడు. రూ.2 వేలకు అయ్యే పనికి అంత అడిగాడు. అన్ని డబ్బులు ఇచ్చే స్థోమత లేకపోవడంతో నేనే నేరుగా చేసుకునేందుకు సిద్ధమైన. అధికారులు ఇది లేదని.. అది లేదని అంటున్నారు. ప్రతి చిన్న పొరపాటును చూపుతూ తిప్పుకొంటున్నారు. వేరే వారు ఏజెంట్ నుంచి వస్తే.. ఏమీ చూడకుండానే ఓకే చేశారు. – నాగరాజు, కొంత్వాన్పల్లి -
భూందాం!
ఆగస్టు 1 నుంచి పెరగనున్న భూముల విలువ – 10 నుంచి 21 శాతం పెంపునకు ఆమోదం – అభ్యంతరాల ఊసెత్తని రిజిస్ట్రేషన్ అధికారులు – రెండ్రోజులుగా కిక్కిరుస్తున్న కార్యాలయాలు అనంతపురం టౌన్: భూముల విలువల మరోసారి పెరగనుంది. ఇందుకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదిత ధరలకు శుక్రవారం నాటికి కమిటీలన్నీ ఆమోదముద్ర వేశాయి. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకున్న రేట్లతో పోలిస్తే 10 నుంచి 21 శాతం పెంపు కనిపిస్తోంది. జిల్లాలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం ధరలను పెంచారు. కార్యాలయాల వారీగా ధరల పెంపు పూర్తయింది. చదరపు గజానికి గరిష్టంగా 21 శాతం పెంచారు. భవన నిర్మాణ స్థల విలువలను కూడా 10 శాతానికి పైగా పెంచేశారు. కొత్త ధరల అమలుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ చైర్మన్‌గా.. తహసీల్దార్, ఎంపీడీఓలు, ఆడిట్ సబ్ రిజిస్ట్రార్ సభ్యులుగా ఉన్న కమిటీలతో పాటు అర్బన్ ప్రాంతాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా.. జెడ్పీ సీఈఓ, మునిసిపల్ కమిషనర్ సభ్యులుగా, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా ఉన్న కమిటీలు ఆమోదం తెలిపాయి. అభ్యంతరాలు స్వీకరించకుండానే ఆమోదం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా తయారు చేసిన భూముల విలువల సవరణకు సంబంధించి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా తూతూమంత్రంగా చేపట్టి ఆమోదముద్ర వేశారు. సాధారణంగా ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెరుగుతుంది. ఇందుకోసం నెల ముందుగానే అధికారులు ప్రక్రియ ప్రారంభించాలి. నగరాలు, పట్టణాల వారీగా ప్రస్తుత, ప్రతిపాదిత మార్కెట్ విలువలను ఖరారు చేయాలి. వాటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలి. గత ఏడాది జూలై 30వ తేదీన భూముల విలువ పెంపు ఉత్తర్వులు రావడంతో అభ్యంతరాలు తీసుకోలేదు. అయితే ఈ ఏడాది ముందుగానే ఉత్తర్వులు వచ్చినా అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. కనీసం భూముల విలువ పెరుగుతుందనే సమాచారం కూడా జనాలకు తెలియకుండా చేసి సవరించిన స్థిరాస్తి మార్కెట్ విలువల అమలుకే మొగ్గు చూపారు. హడావుడిగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను పెంచేసి అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో అంతిమంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్లపై భారం పడనుంది. భూముల విలువ పెరుగుతుందనే విషయం తెలియడంతో జిల్లా వ్యాప్తంగా రెండ్రోజుల నుంచి కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రెండ్రోజుల్లోనే 250 పైగా రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. పైగా శ్రావణమాసం ప్రారంభం కావడంతో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. -
అక్రమాలకు ఊతం
– రిజిస్ట్రేషన్లకు తెగిన ‘ఆధార్’ బంధం – మ్యానువల్‌గా తీసుకుని చేస్తున్న వైనం – ఆందోళన చెందుతున్న సబ్ రిజిస్ట్రార్లు – క్రయవిక్రయదారులదీ అదే పరిస్థితి అనంతపురం టౌన్ : స్తిరాస్థి రిజిస్ట్రేషన్లకు ‘ఆధార్’ బంధం తెగింది. ఫలితంగా అక్రమాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖను పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ను తప్పనిసరి చేసి సంబంధిత డేటాతో అనుసంధానం చేశారు. కార్యాలయాల్లో భూములు అమ్మే వారు, కొనేవారి వివరాలను నమోదు చేయకుండా ఆధార్ నంబర్ నమోదు చేసేవారు. దీంతో ఆటోమేటిక్‌గా వివరాలన్నీ వచ్చేవి. ఈ తర్వాత ఆధార్‌లోని ఫొటోలు, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన క్రయ, విక్రయదారులతో సరిపోల్చి డాక్యుమెంట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్లు చేసేవారు. మూడు రోజుల క్రితం యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిపికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు రిజిస్ట్రేషన్‌శాఖకు ఆధార్ సర్వర్‌ను నిలిపివేశారు. ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించడానికి అవసరమైన ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) సర్వర్‌ను సైతం ఆపేశారు. దీంతో రెండ్రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే బుధవారం సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్లకు సడలింపు ఇచ్చారు. గతంలో రిజిస్ట్రేషన్‌తో పాటు ఆధార్ నంబర్ నమోదు చేయగానే క్రయ, విక్రయదారుల పేరు, ప్రధానంగా ఫొటో స్క్రీన్‌పై వచ్చేవి. దీన్ని చూసుకున్న తర్వాత అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేవారు. ప్రస్తుతం సర్వర్‌తో సంబంధం లేకుండా మాన్యువల్‌గా డాక్యుమెంట్లకు ఆధార్ జిరాక్స్ ప్రతులను జత చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్న వాదన ఆ శాఖ అధికారుల నుంచే విన్పిస్తోంది. కొందరు ఆధార్ కార్డుల్లో ఫొటోలు, పేర్లు మార్పు చేసి తీసుకొచ్చినా వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో క్రయ, విక్రయదారులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ సర్వర్‌తో లింక్ లేకపోవడంతో సర్వర్లోకి వెళ్లి చెక్ చేసుకునే అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో క్రయ, విక్రయదారులు తెచ్చిన ఆధార్ అసలుదా నకిలీదా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. కొందరు ఆధార్‌ను ట్యాంపరింగ్ చేసే అవకాశమూ ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి యూఐడీఏఐ అధికారులకు కనీస మొత్తం చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. అయితే అది చెల్లించకపోవడంతోనే ఆధార్ లింక్‌ను తొలగించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధార్ నంబర్ లేకపోయినా పేర్లను కొట్టి రిజిస్ట్రేషన్ సాగిస్తున్నారు. అయితే ఒరిజినల్ కార్డులను పరిశీలిస్తున్నామని, అయినా కొంత ఆందోళన ఉందని కొందరు సబ్రిజిస్ట్రార్లు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తే అక్రమాలకు తావులేకుండా ఉంటుందని చెప్పారు. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇళ్లు, స్థలాలు, భూములు తదితర స్థిరాస్తి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు రెండ్రోజుల పాటు ఆగిపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోయామన్నారు. ఈ రెండు రోజుల్లో శాఖ సుమారు రూ.8 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. అక్రమాలకు అస్కారం ఉంది : ఆధార్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే సర్వర్‌లో మార్పులు చేశారు. ఈ క్రమంలో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని కొట్టిపారేయలేం. అక్రమార్కులు దీన్ని ఆసరాగా తీసుకునే అవకాశం ఉంది. అయినా సబ్రిజిస్ట్రార్లు ఒకటికి రెండు సార్లు పరిశీలించే రిజిస్ట్రేషన్లు చేస్తారు కాబట్టి సమస్య లేదు. వేలిముద్ర, ఇతర ప్రూఫ్‌లు తీసుకుంటున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. – సులేమాన్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ -
రిజిస్ట్రేషన్లు ఢమాల్
అనంతపురం టౌన్ : బ్యాంకులన్నీ మూతపడిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రష¯Œ్స శాఖలో బుధవారం రిజిసే్ట్రషన్లు అమాంతం తగ్గిపోయాయి. అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రోజూ సుమారు 700 నుంచి 800 వరకు డాక్యుమెంట్లు రిజిసే్ట్రష¯ŒS అయ్యేవి. అయితే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. వందకు మించి రిజిసే్ట్రషన్లు కాలేదు. యాడికి, కణేకల్లు వంటి గ్రేడ్–2 కార్యాలయాల్లో అసలు రిజిసే్ట్రష¯ŒS ప్రక్రియే ప్రారంభం కాలేదు. బ్యాంకులు కూడా మూసివేయడంతో చలానాలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందే చలానా కట్టినవారు మాత్రమే కార్యాలయాలకు వచ్చి తమ పనులు చేసుకుని వెళ్లారు. బ్యాంక్ రుణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒక్కరోజే సుమారు రూ.50 లక్షల వరకు శాఖ ఆదాయాన్ని కోల్పోయింది. అనంతపురం రిజిసే్ట్రష¯ŒS కార్యాలయంలో రోజూ 70 డాక్యుమెంట్ల రిజిసే్ట్రష¯ŒS జరిగేవి. బుధవారం మాత్రం 15కు మించలేదని సబ్ రిజిస్ట్రార్ తాయన్న తెలిపారు. రూరల్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్క రిజిసే్ట్రష¯ŒSకు కూడా అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. -
'లక్ష్యానికి మించి ఆదాయం'
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జూలై నెలలో లక్ష్యానికి మించి భారీగా రిజిస్టేషన్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రూ.4.50 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా.. రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరింది. నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, బండి ఆత్మకూరు, బేతంచర్ల, కోవెలకుంట్ల, పాణ్యం, అవుకు, సిరివెల్ల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా నమోదు అవుతుండడంతో పూర్తి ఏడాదికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.