హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబో మంటున్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం..హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌లు భారీ తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో నాలుగు జిల్లాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో ఇళ్ల రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో 25 శాతం తగ్గి 5,146 యూనిట్లకు చేరినట్లు తెలిపింది.
ఫైనాన్షియల్ ఇయర్ 2022లో రెండవ సారి రిజిస్ట్రేషన్ ఖర్చులు (ఫిబ్రవరి1, 2022 నుండి అమలులోకి రిజిస్ట్రేషన్/మార్కెట్ విలువలలో అప్‌వర్డ్ రివిజన్) పెరగడం, గృహాల విక్రయాలు మందగించాయని తెలిపింది. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడం వల్ల రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. ఈ కేటగిరీలో అమ్మకాల రిజిస్ట్రేషన్‌లు ఫిబ్రవరి 2021లో 2,888 యూనిట్ల నుండి 2022 ఫిబ్రవరిలో కేవలం 844 యూనిట్లకు తగ్గాయి.
ఫిబ్రవరి 2022లో నాలుగు జిల్లాలకు సంబంధించి మొత్తం విక్రయాలు 25శాతం తగ్గాయి. హైదరాబాద్ జిల్లా విక్రయాల రిజిస్ట్రేషన్లలో 64 శాతం పడిపోయిందని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో తెలిపింది. రిజిస్ట్రేషన్ డేటా ద్వారా ప్రతిబింబించే విధంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు లావాదేవీ ధర ఫిబ్రవరి 2022లో 21 శాతం పెరిగింది.
ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా అమ్మకాల ధరల పెరుగుదల పరంగా దేశంలోని బలమైన నివాస మార్కెట్‌లలో హైదరాబాద్ ఉంది. అయితే ఒమిక్రాన్ వైరస్ కారణంగా జనవరిలో కార్యాచరణ పరిమితులు, ఫిబ్రవరిలో ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా రూ. 25 లక్షల కంటే తక్కువ కేటగిరీలో ఉన్న ఇళ్లపై కొనుగోలు దారుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని, ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది వ్యవధిలో రిజిస్ట్రేషన్ల వేగం సాధారణ స్థితికి చేరుకుంటాయని బైజల్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment