కర్నూలు జిల్లా నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జూలై నెలలో లక్ష్యానికి మించి భారీగా రిజిస్టేషన్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జూలై నెలలో లక్ష్యానికి మించి భారీగా రిజిస్టేషన్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రూ.4.50 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా.. రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరింది.
నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, బండి ఆత్మకూరు, బేతంచర్ల, కోవెలకుంట్ల, పాణ్యం, అవుకు, సిరివెల్ల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా నమోదు అవుతుండడంతో పూర్తి ఏడాదికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.