heavy income
-
వయసు 23.. పారితోషికం 18 లక్షలు
లండన్: ఆ అమ్మాయి వయసు కేవలం 23. ఆమెకు ఉన్న అభిమానులు 1.6 కోట్లు. ఆమె అందుకునే పారితోషికం సినిమా/ఎపిసోడ్‌కు రూ. 18 లక్షలు. రక్షణగా చుట్టూ బాడీగార్డులు. ఇదీ టిక్‌టాక్ స్టార్ హాలీ హార్న్ ప్రత్యేకత. టిక్‌టాక్‌లో హాలీ పాపులర్ కావడంతో ఆమె తల్లి తన ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. గతేడాది ఆమె టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన వీడియో ఏకంగా 7.7కోట్ల వ్యూస్ పొందడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. కేవలం 15 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఆమె వీడియో సంచలనంగా మారింది. దీంతో దేశంలోనే పెద్ద కంపెనీలు ఆమెతో ప్రకటనలు ఇప్పించేందుకు భారీ ఆఫర్లు ఇచ్చాయి. భారీగా డబ్బు ముట్టజెప్పాయి. దీంతో తన తల్లిని ఉద్యోగం మాన్పించింది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలసి గెర్న్సేలో నివాసముంటోంది. తన కూతురు టిక్‌టాక్‌లో స్టార్ కావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తల్లి జాడీ అన్నారు. తనకు విషయం పూర్తిగా అర్థం కావడం లేదని, అయినప్పటికీ డబ్బు వస్తోందని చెప్పారు. ఆమెకున్న అభిమానులంతా 8 నుంచి 15 లోపు వయసు వారే. అందులో 80% అమ్మాయిలు, 20% అబ్బాయిలు ఉన్నారు. తాను ఈ స్థితికి రావడం సంతోషంగా ఉందని హాలీ అన్నారు. -
మద్యంపై కనిపించని నోట్ల ప్రభావం
తిమ్మాజీపేట: నోట్ల రద్దు తర్వాత నగదు లేక రైతులు, కూలీలు, సామాన్యులు ఇబ్బందులకు గురవుతుంటే మద్యం ఖజానా ఫూల్ అవుతుంది. మద్యంపై నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని అంతా భావించినా మద్యంపై మాత్రం నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపించలేదు. మండల కేంద్రంలోని ఐఎంఎల్(మద్యం) డిపో నుంచి ప్రతిరోజూ నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలతోపాటు షాద్‌నగర్, కొడంగల్, కల్వకుర్తి నుంచి విడిపోయిన మండలాల నుంచి సైతం మద్యం షాపుల యజమానులు తిమ్మాజీపేట గోదాం నుంచే మద్యాన్ని తీసుకెళ్తారు. ఇక్కడి నుంచే పూర్వ జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా అవుతుంది. ప్రతినెలా వచ్చే ఆదాయం కన్నా నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. ప్రతినెలా రూ.70 నుంచి రూ.80కోట్ల మధ్య మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నోట్లు రద్దయిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.160 కోట్ల విక్రయాలు జరిగాయి. రూ.15నుంచి రూ.20 కోట్ల ఆదాయం పెరిగింది. నోట్లు రద్దయ్యాక మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించినట్లయింది. -
'లక్ష్యానికి మించి ఆదాయం'
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జూలై నెలలో లక్ష్యానికి మించి భారీగా రిజిస్టేషన్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రూ.4.50 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా.. రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరింది. నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, బండి ఆత్మకూరు, బేతంచర్ల, కోవెలకుంట్ల, పాణ్యం, అవుకు, సిరివెల్ల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా నమోదు అవుతుండడంతో పూర్తి ఏడాదికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.