వయసు 23.. పారితోషికం 18 లక్షలు | 23 year old TikTok star who takes Remuneration 18 lakhs | Sakshi
Sakshi News home page

వయసు 23.. పారితోషికం 18 లక్షలు

Published Mon, Dec 2 2019 4:41 AM | Last Updated on Mon, Dec 2 2019 5:47 AM

23 year old TikTok star who takes  Remuneration 18 lakhs - Sakshi

లండన్‌: ఆ అమ్మాయి వయసు కేవలం 23. ఆమెకు ఉన్న అభిమానులు 1.6 కోట్లు. ఆమె అందుకునే పారితోషికం సినిమా/ఎపిసోడ్‌కు రూ. 18 లక్షలు. రక్షణగా చుట్టూ బాడీగార్డులు. ఇదీ టిక్‌టాక్‌ స్టార్‌ హాలీ హార్న్‌ ప్రత్యేకత. టిక్‌టాక్‌లో హాలీ పాపులర్‌ కావడంతో ఆమె తల్లి తన ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. గతేడాది ఆమె టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియో ఏకంగా 7.7కోట్ల వ్యూస్‌ పొందడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయింది. కేవలం 15 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఆమె వీడియో సంచలనంగా మారింది.

దీంతో దేశంలోనే పెద్ద కంపెనీలు ఆమెతో ప్రకటనలు ఇప్పించేందుకు భారీ ఆఫర్లు ఇచ్చాయి. భారీగా డబ్బు ముట్టజెప్పాయి. దీంతో తన తల్లిని ఉద్యోగం మాన్పించింది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలసి గెర్న్‌సేలో నివాసముంటోంది. తన కూతురు టిక్‌టాక్‌లో స్టార్‌ కావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తల్లి జాడీ అన్నారు. తనకు విషయం పూర్తిగా అర్థం కావడం లేదని, అయినప్పటికీ డబ్బు వస్తోందని చెప్పారు. ఆమెకున్న అభిమానులంతా 8 నుంచి 15 లోపు వయసు వారే. అందులో 80% అమ్మాయిలు, 20% అబ్బాయిలు ఉన్నారు. తాను ఈ స్థితికి రావడం సంతోషంగా ఉందని హాలీ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement