honorarium hiked
-
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
వయసు 23.. పారితోషికం 18 లక్షలు
లండన్: ఆ అమ్మాయి వయసు కేవలం 23. ఆమెకు ఉన్న అభిమానులు 1.6 కోట్లు. ఆమె అందుకునే పారితోషికం సినిమా/ఎపిసోడ్‌కు రూ. 18 లక్షలు. రక్షణగా చుట్టూ బాడీగార్డులు. ఇదీ టిక్‌టాక్ స్టార్ హాలీ హార్న్ ప్రత్యేకత. టిక్‌టాక్‌లో హాలీ పాపులర్ కావడంతో ఆమె తల్లి తన ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. గతేడాది ఆమె టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన వీడియో ఏకంగా 7.7కోట్ల వ్యూస్ పొందడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. కేవలం 15 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఆమె వీడియో సంచలనంగా మారింది. దీంతో దేశంలోనే పెద్ద కంపెనీలు ఆమెతో ప్రకటనలు ఇప్పించేందుకు భారీ ఆఫర్లు ఇచ్చాయి. భారీగా డబ్బు ముట్టజెప్పాయి. దీంతో తన తల్లిని ఉద్యోగం మాన్పించింది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలసి గెర్న్సేలో నివాసముంటోంది. తన కూతురు టిక్‌టాక్‌లో స్టార్ కావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె తల్లి జాడీ అన్నారు. తనకు విషయం పూర్తిగా అర్థం కావడం లేదని, అయినప్పటికీ డబ్బు వస్తోందని చెప్పారు. ఆమెకున్న అభిమానులంతా 8 నుంచి 15 లోపు వయసు వారే. అందులో 80% అమ్మాయిలు, 20% అబ్బాయిలు ఉన్నారు. తాను ఈ స్థితికి రావడం సంతోషంగా ఉందని హాలీ అన్నారు. -
నేనింతే
అందం, అభినయం కలగలసిన నటి అనుష్క. ఈమె దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అనడం అతిశయోక్తి కాదెమో. ఈ భామ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ చిత్రాలున్నాయి. వీటిలో రెండు తమిళ్, రెండు తెలుగు. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించిన లింగా చిత్రం వచ్చే నెల 12న తెరపైకి రానుంది. అజిత్‌కు జంటగా నటించిన ఎన్నై అరుందాల్ సంక్రాంతికి సందడి చేయనుంది. అలాగే తెలుగులో రుద్రమదేవిగా నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక దక్షిణాది సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్లో రూపొందుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా వరసగా భారీ చిత్రాలను సొంతం చేసుకున్న అనుష్క పారితోషికం భారీగా పెంచిందని, గర్వం బాగా పెరిగిపోయిందని కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి దీటుగానే బదులిస్తోంది అనుష్క. నటిగా తన అంతస్తు పెరిగిందని చెప్పింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. తెలుగులోనూ రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చిత్రాలు తన చేతిలో ఉన్నాయని తెలిపింది. అయితే అహంకారం, గర్వం, అసూయ అనేవి తన దరిదాపుల్లో లేవని స్పష్టం చేసింది. సినీ రంగ ప్రవేశానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానని వెల్లడించింది.