వంశీ(ఫైల్)
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని కనుముకులలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కుంభం భద్రయ్య కుటుంబ సభ్యులతో 11 ఏళ్ల క్రితం వలస వచ్చి మండలంలోని కనుముకుల గ్రామానికి చెందిన రైతు కోట సత్తిరెడ్డికు చెందిన ఫౌల్ట్రిఫామ్‌లో పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడైన కుంభం వంశీ(17) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
శుక్రవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వంశీ మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యా డు. మధ్యాహ్నం ఫౌల్ట్రీఫామ్ సమీపంలో గల తోటలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి వాంతులు చేసుకుంటుండటంతో తల్లిదండ్రులు గమనించి, ఆరాతీయగా, పురుగుల మందు తాగానని తెలి పా డు. అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకెళుతండగా మార్గమధ్యలో మృతిచెందాడు. చౌటుప్పల్ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మతదేహాన్ని స్వస్థలం అర్వపల్లికి తరలిం చారు. చేతికంది వచ్చిన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment