‘ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’
Published Wed, Jul 20 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
పాత శ్రీకాకుళం: అధికారం చేపట్టిన రెండేళ్ల పాలనలో టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని డీసీసీ అధ్యక్షుడు డోల జగన్, పీసీసీ అధికార ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న ప్రవేశపెట్టనున్న ప్రత్యేక హోదా బిల్లుకైనా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Advertisement
Advertisement