ఆ రెండు పార్టీలకు పతనం తప్పదు..కొట్ల | 2019 Elections Tdp And Bjp Failure | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదు 

Published Fri, Apr 20 2018 7:53 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

2019 Elections Tdp And Bjp Failure - Sakshi

మాట్లాడుతున్న కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి

దేవనకొండ : వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదని  కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం దేవనకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ పాలనకు ప్రజలే చరమగీతం పాడుతారన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రేమనాథరెడ్డి, అలారుదిన్నె నారాయణరెడ్డి, బొజ్జప్పనాయుడు, సంపంగి గోవిందరాజులు, రాజాసాహెబ్, బండ్లయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement