ఏటీఎంలో చోరీకి యత్నం
ఏటీఎంలో చోరీకి యత్నం
Published Wed, Aug 24 2016 8:25 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
సెక్యూరిటీగార్డుపై దాడి
చిలకలపూడి స్టేషన్‌లో కేసు నమోదు
మచిలీపట్నం(కోనేరుసెంటర్) :
ఏటీఎంలో చోరీకి గుర్తు తెలియని దుండగులు యత్నించారు. సెక్యూరిటీగార్డు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విఫలం కావటంతో ఉడాయించారు. ఈ సంఘటన మచిలీపట్నంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. పట్టణంలోని చిలకలపూడి స్టేట్‌బ్యాంకు ఏటీఎం ఉంది. సెక్యూరిటీ గార్డుగా పంబలగూడేనికికు చెందిన గాలంకి శ్రీహరిబాబుlపనిచేస్తున్నాడు. సుమారు 2 గంటల సమయంలో గుర్తు తెలియని ముగ్గురు ముసుగులు వేసుకుని ఏటీఎం లోనికి వెళ్లారు. నాలుగో వ్యక్తి రోడ్డుపై నిలబడ్డాడు. ఏటీఎంలోకి వెళ్లిన ముగ్గురు ఒక్కసారిగా శ్రీహరి తలకు గుడ్డ చుట్టి ఏటీఎం లాకర్ నంబరు చెప్పమంటూ బెదిరించారు. తెలియదని బదులు ఇవ్వటంతో సుత్తులతో అతని తలపై చక్షణారహితంగా కొట్టారు. మిషన్‌ను బద్దలు కొట్టి డబ్బు బయటికి తీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవటంతో గత్యంతరంలేని దుండగులు అక్కడి నుంచి బైక్‌లపై చిలకలపూడి రైల్వేస్టేషన్ వైపు ఉడాయించారు. తీవ్రగాయాపాలైన శ్రీహరి తేరుకుని జరిగిన విషయాన్ని ఫోన్‌లో తన సోదరుడికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీహరి సోదరుడు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.
డీఎస్పీ పరిశీలన..
సమాచారం అందుకున్న డీఎస్పీ డీఎస్ శ్రావణ్‌కుమార్ ఏటీఎం సెంటర్‌ను పరిశీలించారు. క్లూస్‌టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించగా, రంగంలోకి దిగిన డాగ్‌స్వా్కడ్ ఏటీఎం నుంచి చిలకలపూడి రైల్వేస్టేషన్ వైపు వెళ్లి ఆగిపోయింది. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జనార్దన్, నాగరాజు తెలిపారు. దుండగులను సీసీ పుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement