Elon Musk Admits X May Fail And Soon Remove Headlines From News Articles, Know In Details - Sakshi
Sakshi News home page

ఎక్స్‌ టేకోవర్: ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?

Published Tue, Aug 22 2023 3:39 PM | Last Updated on Tue, Aug 22 2023 5:13 PM

Elon Musk admits X may fail and soon remove headlines from news articles - Sakshi

గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లకు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌  పలు కీలక మార్పులకు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా  అందరూ ఊహించినట్టుగా  ఈ టేకోవర్‌  ఫెయిల్‌ కావచ్చు కానీ సాధ్యమైనంతవరకు సక్సెస్‌ను  ప్రయత్నిస్తున్నామనడం చర్చకు దారి తీసింది. 

అలాగే ఎక్కువగా సంపాదించాలనుకునే జర్నలిస్టులకు ఎక్స్‌లో ఆఫర్‌ అంటూ ట్వీట్‌ చేయడం సంచలనం రేపుతోంది. ఎవరైతే స్వేచ్ఛగా ఆర్టికల్స్‌ రాయాలనుకుంటారో ఆ జర్నలిస్టులు  డైరెక్ట్‌ ఎక్స్‌లో పబ్లిష్‌ చేసి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌  వైరల్‌గా మారింది ఇప్పటికే ఇది 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. (

అంతేకాదు ఆయా ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మరింత చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌లో షేర్‌ అయిన వార్తల ముఖ్యాంశాలను తొలగించాలని యోచిస్తున్నాడు.తద్వారా ట్వీట్ పరిణామాన్ని తగ్గించి, యూజర్‌ టైమ్‌లైన్‌లో మరిన్ని ట్వీట్‌లు సరిపోయేలా చేయడానికే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. యూజర్‌ స్క్రీన్‌పై ట్వీట్ ఆక్రమించే నిలువు స్థలాన్నితగ్గించడమే ఈ మార్పు వెనుకకారణమని ఫార్చ్యూన్‌ నివేదించింది.దీనితో పాటు క్లిక్‌బైట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మస్క్  భావిస్తున్నాడట.

ఎక్స్‌ (ట్విటర్‌) టేకోవర్  విఫలం  కావచ్చు:  మస్క్‌ 
ముఖ్యంగా గా బిలియన్ల డాలర్ల  ట్విటర్‌  టేకోవర్ "విఫలం కావచ్చు" అని  అంగీకరించడం మరో సంచలన వార్తగా మారింది.  ట్విటర్‌ "బ్లాక్" ఫీచర్‌ను తొలగించే నిర్ణయంపై తాజా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్ననేపథ్యంలో మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత నెలలో మార్క్ జుకర్‌బర్గ్ మెటా ప్రారంభించిన టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌కు పోటీ వెబ్ వెర్షన్‌ను రూపొందించడానికి సిద్ధమైనప్పటికీ ఎక్స్‌ అనిశ్చిత భవిష్యత్తుపై మస్క్  ఇలా పేర్కొన్నాడు. "చాలామంది ఊహించినట్లుగా తాము విఫలం కావచ్చు, కానీ కనీసం ఒకరిగాఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తాము." అన్నాడు. అలాగే  ఆదివారం నాటి పోస్ట్‌లో ."విచారకరమైన నిజం ఏమిటంటే, ప్రస్తుతం గొప్ప "సోషల్ నెట్‌వర్క్‌లు" లేవు అందుకే అలాంటి నొకదానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని  తెలిపాడు.

కాగా ఇప్పటికే బ్లూటిక్‌ పేరుతో యూజర్లనుంచి చార్జ్‌ వసూలు చేస్తున్నారు. అలాగే ఇటివలి కాలంలో పరిచయం చేసిన యాడ్‌ రెవెన్యూ షేర్‌  ఫీచర్‌ కింద వెరిఫైడ్ యూజర్లు మానిటైజేషన్ రూల్స్ ప్రకారం డబ్బు సంపాదించుకునే అవకాశం అందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో స్వేచ్ఛగా రాయాలనుకునే జర్నలిస్టులకు డబ్బులు ఆర్జించే అవకాశాన్ని కల్పించడం విశేషం.అయితే దీనిపై పబ్లిషర్స్‌నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement