న్యూఢిల్లీ: ప్రకటనల ఆదాయంలో వాటాల కింద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విటర్) నుంచి వ్యక్తులకు వచ్చే ఆదాయం కూడా జీఎస్‌టీ పరిధిలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్ క్రియేషన్‌ను సర్వీసు కింద పరిగణిస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ట్యాక్స్ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఒక సంవత్సరంలో అద్దె ఆదాయం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీసులు వంటి వివిధ సర్వీసుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ. 20 లక్షలు దాటిన పక్షంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ఎక్స్ ఇటీవల ప్రకటనలపై తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కి కూడా అందించడం ప్రారంభించింది. ఇందుకోసం సదరు సబ్‌స్క్రయిబర్స్ పోస్టులకు గత మూడు నెలల్లో 1.5 కోట్ల ఇంప్రెషన్‌లు, కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. ఎక్స్ నుంచి తమకు ఆదాయం వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈమధ్య పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment