వైద్యుల నిర్లక్ష్యం వల్ల నగరంలో మరో ప్రాణం బలైంది.
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల నగరంలో మరో ప్రాణం బలైంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందగా.. నగరంలోని కొత్తపేట ఓజోన్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కిడ్నీ ఆపరేషన్ ఫెయిల్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతిచెందాడు. దీంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్‌కు సరైన సమయంలో చికిత్స చేయకుండా ఆలస్యం చేసి ఆపరేషన్ నిర్వహించడంతోనే ఆయన మృతిచెందాడని బంధువులు ఆందోళన చేస్తున్నారు.