అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు | tdp government fail | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు

Published Mon, Jan 30 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

tdp government fail

  • వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ధ్వజం
  • గాదరాడ (కోరుకొండ) : 
    రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నిత్యం మోసం చేస్తున్నాడని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్‌ జరిగింది. కార్యక్రమంలో కన్నబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యూత్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజాల వద్దకు గ్రామంలోని పలువురు మహిళలు, రైతులు, యువత, వృద్ధులు, వికలాంగులు వచ్చి పలుసమస్యలను ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై నమ్మకం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డిపై ప్రేమ రోజురోజుకు పెరుగుతుందన్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని అనేక మంది ప్రజలు తమ వద్దకు వచ్చి చెబుతున్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచే నాయకులపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయిస్తున్నాడని, వాటికి భయపడేది లేదని, ప్రజలపక్షాన నిలుస్తామన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని స్పూర్తిగా తీసుకొని ఆయన బాటలోనే నిరంతరం పనిచేస్తామన్నారు. అమరావతిలో నేటికి ఏటువంటి అభివృధ్ధి జరగలేదని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు పాలన దోచుకుని తినడమేనని అన్నారు. వైఎస్సార్‌ సీపీ యూత్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ ప్రచారకమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, శెట్టి బాబూరావు, జవ్వాది సతీష్, రాజమహేంద్రవరం కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి, పార్టీ జిల్లా కార్యదర్శులు అడబాల చినబాబు, కార్మిక సంఘం జిల్లా నాయకులు నిడిగట్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement