
పుట్టిన రోజే బొక్కబోర్లా..
సియోల్: తమ దేశ వ్యవస్థాపకుడి పుట్టిన రోజే ప్రయోగాలకు దిగిన ఉత్తర కొరియా బొక్కబోర్లా పడింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన బాలిస్టిక్ క్షిఫణి ప్రయోగం విఫలమైందని దక్షిణ కొరియా మిలటరీ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొరియా మొబైల్, మీడియం రేంజ్ ముసుదాన్ మిసైల్ను ప్రయోగించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ మిసైల్ అమెరికాలోని పలు ప్రాంతాలను నేరుగా ఢీకొట్ట గల సత్తా కలదు. అది చర్చలో ఉండగానే ప్రస్తుత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్.. తన తాత ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ టూ సంగ్ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. కానీ, అది విఫలమైంది. అయితే, అది ఏ క్షిపణి అని, ఏ పేరు పెట్టారనే వార్తలు బయటకు రాకపోయినా అది కూడా మసుదాన్ క్షిపణి అయ్యుంటుందని దక్షిణ కొరియా అంటోంది.