missile launch
-
Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. ఆ నౌకలో భారతీయులు 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. -
అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష
మాస్కో: అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఈ క్షిపణి అణువార్హెడ్లను మోసుకెళ్లగలదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంతో రష్యా, పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, అంతర్జాతీయ అణు పరీక్ష నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతూ రష్యా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై అధ్యక్షుడు పుతిన్ గత వారం సంతకం చేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బులావా క్షిపణిని రష్యా ఉత్తర తెల్ల సముద్రంలో నీటి అడుగు నుంచి పరీక్షించి చూసినట్లు రష్యా రక్షణ శాఖ వివరించింది. -
మళ్లీ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
సియోల్: తమ ప్రత్యర్థి దేశమైన దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం అమెరికా ఆయుధ సాయం అందిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర కొరియా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండు షార్ట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మంగళవారం బహిర్గతం చేశారు. ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్షిపణి ప్రయోగం నిర్వహించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. రాజధాని పాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ రెండు బాలిస్టిక్ మిస్సైళ్లు 400 కిలోమీటర్లు(248 మైళ్లు) ప్రయాణించి తూర్పు కోస్తా తీరంలో సముద్రంలో పడిపోయాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు. తమ నిరసనను ఉత్తర కొరియాకు తెలియజేశామని చెప్పారు. -
విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది!
ఉత్తర కొరియా. ప్రపంచంలో దూర్త దేశాల్లో ఒకటిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు యూరప్ దేశాలు గుర్తించిన దేశం. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. యథేచ్ఛగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది. తమవైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్ అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నారు. అమెరికా–దక్షిణ కొరియా కూటమి సంయుక్తంగా సైనిక విన్యాసాలపై మండిపడుతున్నారు. తాజాగా 48 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణి ప్రయోగాలు జరిపారు! ఉభయ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన పరుస్తోంది. వీటి మధ్య ఇంతటి విద్వేషానికి కారణమేమిటి...? ఉత్తర, దక్షిణ కొరియాల శత్రుత్వానిది దశాబ్దాల చరిత్ర. స్వతంత్ర దేశమైన ఉమ్మడి కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్ ఆక్రమించుకుంది. 1945 దాకా నిరంకుశ పాలనలో కొరియా మగ్గిపోయింది. జపాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. కమ్యూనిస్టు నేత కిమ్ ఇల్–సంగ్ కొరియా విముక్తి కోసం మంచూరియా నుంచి జపాన్ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్ అధీనంలో ఉన్న కొరియాలోకి సోవియట్ సేనలు అడుగుపెట్టాయి. 38వ ప్యారలెల్ లైన్ దాకా దూసుకొచ్చాయి. దాని దిగువ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అలా కొరియా విభజనకు బీజం పడింది. 1945లో ప్యారలెల్ లైన్‌కు ఎగువన తమ అధీనంలోని కొరియా ప్రాంతంలో పాంగ్యాంగ్ రాజధానిగా సోవియట్ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఉత్తర కొరియా. దిగువ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే దక్షిణ కొరియా! ప్రచ్ఛన్నయుద్ధం చిచ్చు కొరియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సోవియట్ యూనియన్, మిత్రదేశాలు భావించాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ఉత్తర కొరియా మద్దతు కోసం అక్కడి కమ్యూనిస్టులను సోవియట్ ప్రోత్సహించింది. దాని అండతో కిమ్ ఇల్ సంగ్ పెద్ద నేతగా అవతరించాడు. 1948లో ప్రధానిగా పీఠమెక్కాడు. అనంతరం సోవియట్ సేనలు ఉత్తర కొరియాను వీడాయి. మరోవైపు దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం కమ్యూనిస్టులను కఠినంగా అణచివేసింది. అమెరికాలో చదివిన కమ్యూనిస్టు వ్యతిరేకి సైంగ్ మాన్ రీ కి మద్దతిచ్చింది. 1948లో జరిగిన ఎన్నికల్లో సైంగ్‌మాన్ రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1949లో అమెరికా సైన్యం దక్షిణ కొరియా వీడింది. అక్కడి నుంచి ఇరు కొరియాల మధ్య కొట్లాటకు బీజం పడింది. కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని తామే పాలిస్తున్నామని, ఉభయ ప్రభుత్వాలు వాదించడం మొదలుపెట్టాయి. కిమ్ ఇల్ సంగ్ నాటి సోవియట్, చైనాల్లోని కమ్యూనిస్టు పాలకులు స్టాలిన్, మావోల మద్దతు కోరారు. ఇటు సైంగ్ మాన్ రీ కూడా ఉత్తర కొరియాను జయించాలన్న ఆకాంక్షలను దాచుకోలేదు. ఇది కొరియన్ యుద్ధానికి దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కిమ్’ చేసిన పనికి జపాన్‌లో హై అలర్ట్!
టోక్యో: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణీ పరీక్షలు చేపడుతూ తన పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు సైతం హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టి జపాన్‌లో అలజడి సృష్టించారు. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టినట్లు దక్షణ కొరియాతో పోటు జపాన్ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు జపాన్ పీఎం. కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిసైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! -
హిందూ సాగరంలోకి చైనా నిఘా నౌక.. భారత క్షిపణి పరీక్ష వాయిదా!
న్యూఢిల్లీ: చైనాకు చెంది నిఘా నౌక యువాన్ వాంగ్-5 ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకున్న క్రమంలో భారత్-చైనాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ చైనాకు చెందన మరో నిఘా నౌక వల్ల భారత్ చేపట్టబోయే క్షిపణి పరీక్షపై ప్రభావం పడుతోంది. డ్రాగన్‌కు చెందన నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. నవంబరు 10-11 తేదీల్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు ఇటీవలే నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది భారత్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే నోటమ్ జారీ చేసిన తర్వాత చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే నిఘా, పరిశోధక నౌక.. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత క్షిపణులు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఆ నిఘా నౌకకు ఉండటమే అందుకు కారణం. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి శుక్రవారం ఉదయమే బయల్దేరింది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడం.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్ చేసిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలు.. ఓపీఎస్ పునరుద్ధరణ.. మహిళలకు రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం -
ఆగని ఉ.కొరియా క్షిపణులు
సియోల్: ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగ పరంపర గురువారమూ కొనసాగింది. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) సహా కనీసం ఆరుక్షిపణులను ప్రయోగించింది. తాజా పరిణామంతో జపాన్ ఉలిక్కిపడింది. రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి గురువారం ఉదయం 7.40 గంటలకు ఒక ఐసీబీఎంను, ఒక గంట తర్వాత అక్కడికి సమీపంలోని కచియోన్ నుంచి రెండు తక్కువ శ్రేణి మిస్సైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్లు దక్షిణకొరియా సైన్యం ధ్రువీకరించింది. పొరుగు దేశాల భూభాగాల్లోకి ప్రవేశించకుండా నివారించేందుకు ఐసీబీఎంను ఎత్తులో ప్రయోగించి ఉండవచ్చని తెలిపింది. ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని జపాన్ పేర్కొంది. తమ గగనతలం మీదుగా మాత్రం వెళ్లలేదని తెలిపింది. ఈ ప్రయోగంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ..అండర్‌గ్రౌండ్ లేదా పటిష్టమైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలంటూ మియాగి, యమగట, నిగట ప్రిఫెక్చర్ల ప్రజలను కోరింది. ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం క్షిపణి ప్రయోగాలపై ఉత్తరకొరియా ఒక ప్రకటన చేసింది. దక్షిణకొరియా, అమెరికాలు సైనిక విన్యాసాలను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. తర్వాత మరో 3 క్షిపణుల్ని ప్రయోగించింది. -
కొరియా మరో క్షిపణి పరీక్ష
సియోల్: ప్రపంచ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా కొత్తగా డిజైన్ చేసిన క్షిపణిని ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారని తెలిపింది. ఈ ప్రయోగంతో ఫ్రంట్‌లైన్ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందని చెప్పింది. ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ప్రయోగాల్లో ఇది 13వది. చదవండి: North Korea: కిమ్ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్ కొరియన్లు -
ఉత్తర కొరియాలో మూవీ.. హీరోగా కిమ్ జోంగ్ ఉన్
Kim Jong Un Guiding An Ballistic Missile: ఉత్తర కొరియా అధ్యక్షుడు అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నిషేధిత ఖండాంతర క్షిపణిని 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి క్షిపణిని వినియోగించింది. ఈ మేరకు 2017 నాటి మిసైల్ ప్రయోగాన్నిహాలీవుడ్ మూవీ మాదిరి ఫుటేజ్‌ని విడుదల చేసింది. అందులో ఒక పాత స్కూల్‌కి సమీపంలో కిమ్ జోంగ్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి 2017 నాటి అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ జెయింట్ హ్వాసాంగ్-17 క్షిపణిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిచింది. ఉత్కంఠభరితమైన సంగీతంలో, ఇద్దరు జనరల్స్ మధ్య కెమరా యాక్షన్ అనగానే స్లో మోషన్లో కిమ్ వచ్చి తన సన్ గ్లాసెస్‌ని పగలుగొట్టి సైనికుల క్షిపణి ప్రయోగానికి ఆమోదం తెలుపుతున్నట్లు ఉంటుంది. పైగా ఆ క్షిపణి కౌంట్‌డౌన్ దృశ్యంలో సైనికులు అగ్ని అని అరుస్తున్నట్లు కనిపించింది. ప్యోంగ్యాంగ్ తన సైనిక సామర్థ్య గొప్పతనాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆ వీడియో ఫుటేజ్ ఉంది. దీన్ని వారు ఒక చలన చిత్రంగా రూపొందించి మరీ సంబురాలు చేసుకున్నారు. అదీ కూడా ఖండాంతర క్షిపణిని విజయవంతం అయిన నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ హీరోగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన మూవీ మాదిరి వీడియోని రూపొందించారని సెజోంగ్ ఇన్స్టిట్యూట్లోని సెంటర్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్‌కు చెందిన చియోంగ్ సియోంగ్-చాంగ్ తెలిపారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ సినీ వీరాభిమాని. ఉత్తర కొరియా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి 1978లో దక్షిణ కొరియా చిత్ర దర్శకుడు నటిని కిడ్నాప్ చేయాలని ఆదేశించిన ఘనుడు. ఇప్పుడు కూడా ఉత్తరకొరియా చలనచిత్రాల నిర్మాణం కోసం భారీగా వనరులను కేటాయిస్తుంది గానీ సినిమాలన్ని అధికార కిమ్ కుటుంబాన్ని కీర్తిస్తూ తీయాల్సిందే. శుక్రవారం విడుదల చేసిన మూవీ మాదిరి క్షిపణి వీడియోలో విదేశీ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఉత్తర కొరియా తమ సినిమాల్లో ఎక్కడైన విదేశీ ప్రభావం కనిపిస్తే కఠినంగా శిక్షిస్తుంది. విదేశీ దుస్తులతో గానీ, విదేశీ చిత్రాలను అనుకరించి గానీ సినిమాలు నిర్మిస్తే శిక్షిస్తుంది. ఏది ఏమైన కిమ్ మాటతప్పి మరీ భారీ ఖండాంతర ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగిచండంతో యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా యూఎన్ భద్రతా మండలి శుక్రవారం ఈ ప్రయోగంపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే ఉత్తర కొరియా ఆయుధా ప్రయోగాలపై పలు ఆంక్షలు ఎదుర్కొంటునప్పటికీ వాటన్నింటిన పక్కన పెట్టి మరోసారి తన అత్యుత్సాహాన్ని బయటపెట్టుకుంది. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఉత్తర కొరియా కిమ్ సంబురాలు, వణికిపోతున్న పొరుగు దేశాలు) -
ఉత్తర కొరియా కిమ్ కావరం.. మళ్లీ టార్గెట్ అమెరికా!
ఒకవైపు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని.. ఎలా బయటపడేయాలన్న అంశంపై ఫోకస్ పెట్టినట్లు వరుస ప్రకటనలు ఇచ్చుకున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్. అయితే అదంతా ఉత్త బిల్డప్ అనే విషయం మరోసారి తేటతెల్లమైంది. వద్దని ప్రపంచమంతా వారిస్తున్న ఉన్న నిధులన్నింటిని అణు క్షిపణి ప్రయోగాలకే కేటాయిస్తూ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు. ఈ ఒక్క నెలలోనే ఏడు మిస్సైల్స్‌ను పరీక్షించగా.. తాజాగా ఉత్తర కొరియా జరిపిన భారీ క్షిపణి ప్రయోగం గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. కారణం.. గత ఐదేళ్లలో నార్త్ కొరియా జరిపిన అత్యంత శక్తివంతమైన క్షిపణి పరీక్ష ఇదే కాబట్టి!. క్షిపణి వార్‌హెడ్‌కు ఇన్స్టాల్ చేసిన కెమెరా స్పేస్ నుంచి భూమిని ఫొటోలు తీయగా.. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆ ఫొటోల్ని సైతం సంబురంగా రిలీజ్ చేసింది. అయితే పనిలో పనిగా.. అగ్రరాజ్యాన్ని కవ్వించే విధంగా ప్రకటనలు చేసుకుంది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. అయితే మిడ్ రేంజ్‌గా ప్రకటించుకున్నప్పటికీ.. ‘వాసాంగ్-12 Hwasong-12 అమెరికా గువాం తీరాన్ని(సుమారు 2,128 మైళ్ల దూరాన్ని) తాకే అవకాశం ఉందని ప్రకటించడం ద్వారా శాంతిచర్చలను పక్కనపడేసి అగ్రరాజ్యంపై కయ్యానికి కాలు దువ్వినట్లయ్యింది. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో పరీక్షలు జరపడం గమనార్హం. అంతర్జాతీయ ఆంక్షలను పట్టించుకోకుండా ప్యోంగ్యాంగ్ మిలిటరీని శక్తివంతం చేసే దిశగా కిమ్ సర్కార్ ప్రయత్నాలు ఉధృతం చేస్తోంది. మరోవైపు పొరుగు దాయాది దేశం దక్షిణ కొరియా.. 2017 సమయంలో ఉత్తర కొరియా తీరు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని చెబుతోంది. త్వరలో న్యూక్లియర్తోపాటు ఖండాంతర మిస్సైల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి వాసాంగ్-12ను 2017లోనే పరీక్షించినప్పుడు.. గువాం రేంజ్‌కి చేరుతుందని ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఈ తరుణంలో ప్రస్తుతం దాని రేంజ్ మరింత పెరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒక దిక్కు చైనాలో వింటర్ ఒలింపిక్స్, మరోవైపు దక్షిణ కొరియాలో మార్చ్‌లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కొరియా కవ్వింపులపై అంతర్జాతీయ సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రయోగంపై వైట్‌హౌజ్ నుంచి పూర్తిస్థాయి స్పందన రావాల్సి ఉంది. సంబంధిత వార్త: ఉత్తరకొరియా భారీ క్షిపణి ప్రయోగం -
ఉత్తరకొరియా భారీ క్షిపణి ప్రయోగం
సియోల్: అమెరికా, దక్షిణకొరియాలను కవ్వించేందుకు యత్నిస్తున్న ఉత్తరకొరియా ఆదివారం భారీ క్షిపణి ప్రయోగం జరిపింది. బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఉత్తరకొరియా ఈ స్థాయి ప్రయోగం జరపడం ఇదే మొదటిసారి. దీంతో ఒక్క జనవరిలోనే ఈ దేశం ఏడు క్షిపణి పరీక్షలు జరిపినట్లయింది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. ఈ ప్రయోగాన్ని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఖండించాయి. 2017 తర్వాత దీర్ఘస్థాయి క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించడం ఇదే తొలిసారి. ఐరాస విధించిన ఆంక్షలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియా మిసైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తమపై విధించిన ఆంక్షలు తొలగించి చర్చలు పునఃప్రారంభించేలా బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఈ చర్యలకు పాల్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. సైనిక శిక్షణ, రాజకీయంగా అమెరికాను ఇరుకున పెట్టడం, కొత్త సిస్టమ్స్ ఇంజినీరింగ్ అవసరాలు, విదేశాలకు విక్రయించేలా ప్రచారం కోసం, ఇంజినీరింగ్ సిస్టమ్స్ పరీక్షల కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే దేశ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఈ పరీక్షలని ఉత్తరకొరియా అధినేత కిమ్ ప్రకటించారు. ఉత్తరకొరియా చర్యలపై చర్చకు వెంటనే భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్‌ఇన్ పిలుపునిచ్చారు. పరిస్థితులన్నీ తిరిగి 2017లో ఉన్న వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కిమ్ ఈ చర్యలకు స్వస్తిపలకాలని కోరారు. చర్యను ఖండించిన యూ ఎస్ మాత్రం ఈ చర్య తమకు, తమ మిత్రులకు ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించింది. చైనాలో ఒలంపిక్స్ పూర్తైన తర్వాత ఉత్తరకొరి యా దూకుడు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
కిమ్ దుందుడుకు చేష్టలు.. స్పందించిన అమెరికా
వాషింగ్టన్: ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు చేష్టలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. వారం వ్యవధిలో రెండోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో మిస్సైల్ పరీక్షలపై కిమ్ వెనక్కి తగ్గాడన్న అంచనాలు మళ్లీ తప్పాయి. కేవలం వారం వ్యధిలో రెండుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వమించాడు కిమ్ జోంగ్ ఉన్. స్వయంగా దగ్గరుండి మరీ పరీక్షించాడు. ఈ చర్యలు.. అంతర్జాతీయ సమాజానికి ముప్పుగా పరిణమించబోతున్నాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కొరియా, జపాన్ దేశాల రక్షణ కోసం తమ నిబద్ధతను చాటుకుంటామని అమెరికా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమతి భద్రత మండలి నియమ, నిబంధనలు ఉల్లంఘించిదని అగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే ఉత్తర కొరియా రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరింది. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. అయితే దేశసంస్కరణల సంగతి ఎలా ఉన్నా.. రక్షణ విభాగంలో తగ్గేదేలే లేదని ప్రకటించుకుంది కిమ్ అధికార విభాగం. చదవండి: మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: అణ్వాయుధాలను తగ్గించు కోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత బుధవారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని అమెరికా సైన్యం పేర్కొంది. సైనిక సంపత్తిని మరింతగా పెంచుకోనున్నట్లు ఉ.కొరియా ఇలా క్షిపణి ప్రయోగాల ద్వారా చెబుతోందని అమెరికా అభిప్రాయపడింది. సైన్యాన్ని పటిష్టవంతం చేస్తామని పార్టీ సమావేశంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞచేసిన వారం రోజుల్లోనే ఉత్తర జగాంగ్ ప్రావిన్స్‌లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం. -
మరోసారి సత్తా చాటిన ‘అగ్ని–5’
సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని–5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సిద్ధం చేసింది. -
అమ్ముల పొదిలో నాగాస్త్రం
జైపూర్: మన దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో గురువారం ఉదయం 6:45 గంటలకి నాగ్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్టు డీఆర్డీఓ వెల్లడించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఏటీజీఎం)ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. నాగ్ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయినా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి క్యారియర్ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్ బిఫోర్ లాంచ్’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాగ్ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పోఖ్రాన్లో నింగిలోకి దూసుకెళ్తున్న నాగ్ క్షిపణి -
నాలుగైదేళ్లలో సంపూర్ణ క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. డీఆర్డీవో రెండు నెలల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో సతీశ్‌రెడ్డి ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఆర్డీవో ప్రస్తుతం దేశ రక్షణ దళాలకు అవసరమైన ఏ రకమైన క్షిపణి వ్యవస్థనైనా తయారు చేసి ఇవ్వగల సత్తా కలిగి ఉందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవైపు చైనాతో లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో డీఆర్డీవో అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. శత్రుదేశాల రాడార్లను గుర్తించి నాశనం చేయగల రుద్రం–1తోపాటు బ్రహ్మోస్, అతిధ్వని క్షిపణి ఆధారిత జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థ, ధ్వనికి ఏడు ఐదారు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల, అణ్వాయుధ సామర్థ్యమున్న శౌర్య తదితరాలను డీఆర్డీవో రెండు నెలల్లో పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా డీఆర్డీవో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము ఒకవైపు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఇంకోవైపు రక్షణ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆయుధ వ్యవస్థల తయారీని కొనసాగిస్తున్నారని, ఒక్కో వ్యవస్థ సిద్ధమైన కొద్దీ వాటిని అప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, తద్వారా తయారీ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నామని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలకు సాయం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేం దుకు డీఆర్డీవో చేస్తున్న కృషికి దేశీ పారిశ్రామిక వేత్తలూ తమవంతు సహకారం అందిస్తున్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. రక్షణ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేయగలుగుతున్నారని చెప్పారు. పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ నిధి ఒకదాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వారు పరీక్షలు జరిపేందుకు డీఆర్డీవో పరిశోధన శాలను వారి అందుబాటులో ఉంచామని వివరించారు. రక్షణ దళాల కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు డీఆర్డీవో చాలా కాలంగా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రెండు నెలల్లో అనేక క్షిపణి వ్యవస్థల పరీక్షలు జరిగాయని తెలిపారు. క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్స్ యుద్ధం, టొర్పెడోలు, తుపాకులు, సమాచార వ్యవస్థ తదితర అంశాల్లో భారతదేశం పూర్తిస్థాయి స్వావలంబన సాధించిందని చెప్పారు. -
విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం
భువనేశ్వర్ : శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నాద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే వాయుసేన అమ్ముల పొదలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన రుద్రం -1 క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్-30 నుంచి శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఈ మిసైల్ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్డీఓ అధికారికంగా ప్రకటించింది. చదవండి: 'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించిన ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను పరీక్షించింది. క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చదవండి: సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు -
ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష సక్సెస్
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘన విజయాన్ని సాధించింది. లేజర్ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకు విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. అహ్మద్‌నగర్‌లోని కేకే పర్వతశ్రేణి ప్రాంతంలో ఏబీటీ అర్జున్ ట్యాంక్ ద్వారా ప్రయోగించిన ఈ క్షిపణి 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఢీకొట్టింది. లేజర్ కిరణాల ఆధారంగా పనిచేసే ట్యాంక్ విధ్వంసక క్షిపణులు లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు వాటి కదలికలను గమనిస్తూ ప్రయాణిస్తుంది. లేజర్ కిరణాల సాయంతో మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ క్షిపణిని ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థల సాయంతో ప్రయోగించేలా సిద్ధం చేశారు. పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డెహ్రాడూన్)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి డీఆర్డీవో సిబ్బందిని, పరిశ్రమ వర్గాలను అభినందించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఒకవైపు తల్లడిల్లుతుండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొన్ ఉంగ్ తన పంథాలోనే వెళ్తున్నారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టారు. కిమ్ శుక్రవారం ఉదయం సోంచన్ కౌంటీలోని ఓ ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను అధికార మీడియా విడుదల చేసింది. 700 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ సమావేశం ఏప్రిల్ 10న ఉంటుందని ఈ క్షిపణి ప్రయోగానికి ముందుగా అధికార మీడియా ప్రకటించింది. ఉ.కొరియా శుక్రవారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సముద్రంపైకి ప్రయోగించినట్లు సమీప పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్ కూడా ధ్రువీకరించాయి. ఇవి 410 కిలోమీటర్ల మేర ప్రయాణించి సముద్రంలో పడిపోయాయని ద.కొరియా సైన్యం తెలిపింది.ఉత్తర కొరియాపై కరోనా ప్రభావానికి సంబంధించి బయటి ప్రపంచానికి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఆ దేశంలో కరోనా కేసులు భారీగా∙ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కరోనా: ఉత్తర కొరియా దుందుడుకు చర్య!
ప్యాంగ్యాంగ్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిల్లాడుతుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ‘నా రూటే సపరేటు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో సైన్యం చిన్న తరహా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తుంటే తాపీగా కూర్చుని వాటిని పర్యవేక్షించారు. అంతేకాదు కరోనాను ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని తెలియజేసేందుకు ఏకంగా 700 మంది అధికారులు ఒక్కచోట చేరాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దాయాది దేశం తీరును దక్షిణ కొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అంటువ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో ఇలా క్షిపణులు పరీక్షించడం అనుచిత చర్య అని మండిపడింది. ఈ మేరకు శనివారం ఉదయం 6.45- 50 నిమిషాల సమయంలో కొరియా ద్వీపంలోని సోన్‌చోన్ సమీపంలో ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఉత్తర కొరియా సైనిక చర్య గర్హనీయమన్నారు. (కరోనా: ఉత్తర కొరియాలో పేషెంట్ కాల్చివేత!) కాగా తమ దేశంలో కరోనా వైరస్ ప్రభావం లేదని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ శనివారం సమావేశం కానుందని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 700 మంది ఉన్నతాధికారులు అంతా ఒక్కచోట చేరి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారని వెల్లడించింది. ఈ క్రమంలోనే కిమ్ జోంగ్ ఉన్ క్షిపణుల ప్రయోగానికి సైనిక అధికారులను శుక్రవారం ఆదేశించినట్లు పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా వీక్షించారని.. ఆ సమయంలో మాస్కులు ధరించలేదని వెల్లడించారు. కాగా చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్ జోంగ్ ఉన్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని సరిహద్దు దేశాలు సహా దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. అంతేకాకుండా... కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఉత్తర కొరియా పాశవికంగా హతమార్చినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. (కరోనా: 11 వేలు దాటిన మృతుల సంఖ్య) కోవిడ్: యువతకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు! -
పాక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వైమానిక పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్–2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించింది. ఇది భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచింది. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు రాద్–2 ఆయుధ వ్యవస్థకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను అనుసంధానించారని మిలటరీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాకిస్తాన్ శక్తి, సామర్థ్యాలకనుగుణంగా మరో కీలక అడుగు ముందుకు పడిందని లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ జకీ మంజ్ హర్షం వ్యక్తంచేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సీనియర్ మిలిటరీ అధికారులు ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. కాగా, పాక్ అభివృద్ధి చేసిన ఈ రాద్ క్షిపణిని.. భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి దీటుగా రూపొందించేందుకు ప్రయత్నించిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ పేర్కొంది. -
అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో అస్త్ర క్షిపణిని భారత వైమానిక దళం పరీక్షించింది. సుఖోయ్–30 ఎంకేఐ ద్వారా అస్త్రను ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. అస్త్ర సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఈవోటీఎస్), సెన్సార్లు అస్త్ర క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి చూశాయని, ఎంతో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడైందని‘ ఆ ప్రకటన తెలిపింది. ఈ సందర్భంగా డీఆర్డీఓ, వాయుసేన బృందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం వాయుసేన రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఐ–డెర్బీ, స్వదేశీయంగా రూపొందించిన అస్త్రను వాయుసేనలో చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. అస్త్ర ప్రత్యేకతలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), మరో 50 ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలతో కలిసి అస్త్ర క్షిపణిని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. గాల్లో నుంచి గాల్లోకి 70 కి.మీ. పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ పరిధిని 300 కి.మీ.లకు పెంచడానికి డీఆర్డీఓ ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవడానికి ఈ క్షిపణి గంటకి 5,555 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. 15 కిలోగ్రాముల పేలుడు పదార్థాలతో ప్రత్యేకమైన వార్‌హెడ్ ఉంటుంది. -
‘క్షిపణి’ కేంద్రానికి 26న శంకుస్థాపన
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో మరో కలికితురాయి చేరబోతుంది. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రం ఏర్పాటుతో జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద సముద్ర తీరంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 385 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రం నిర్మాణానికి ఈ నెల 26న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. శంకుస్థాపన అనంతరం నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై డీఆర్డీవో, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులతో కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుతో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు రానుందన్నారు. సమీక్షలో డీఆర్డీవో అడిషనల్ చీఫ్ ఇంజనీర్ కల్నల్ ఎంజీ తిమ్మయ్య, ఈఈ ఎం.వరప్రసాద్, డీఆర్వో ఎ.ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.చక్రపాణి, మచిలీపట్నం ఆర్డీవో జె.ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
కిమ్.. మరో సంచలనం
సియోల్: కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను చేపట్టింది. తక్కువ దూరాలను ఛేదించే రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఆ దేశం గురువారం సముద్రంలోకి ప్రయోగించి కలకలం రేసింది. ఇప్పటివరకు న్యూక్లియర్ పరీక్షల నిలుపుదలపై అమెరికాతో ఉత్తర కొరియా జరుపుతున్న చర్చలు తాజా ప్రయోగంతో సంక్లిష్టమవ్వనున్నాయి. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ల మధ్య కుదిరిన అణు నిరోధక చర్చల తర్వాత జరిగిన మొదటి క్షిపణి ప్రయోగం ఇదే. క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ధ్రువీకరించారు. కొత్త రకం క్షిపణులుగా కనిపిస్తున్న వీటిలో ఒకటి 430 కిలోమీటర్ల దూరం వెళ్లగా.. రెండోది 690 కిలోమీటర్లు వెళ్లినట్లు సియోల్‌లోని అధికారి తెలిపినట్లు సమాచారం. దక్షిణ కొరియాకు హెచ్చరికగా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. ఆయనే స్వయంగా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. శాంతి మంత్రం జపిస్తూనే దక్షిణ కొరియా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కిమ్ మండిపడ్డారు. అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటూ, అమెరికాతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందన్నారు. తమ హెచ్చరికను పెడచెవిన పెడితే కొరియా నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. అయితే కిమ్ కవ్వింపు చర్యలు మానుకోవాలని సూచించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ కూడా స్పందించింది. -
స్వల్ప లక్ష్యం.. సత్వరమే ఛేదిస్తాయి!
భువనేశ్వర్: ఉపరితలం నుంచి గగనతలంలోకి సత్వరమే ప్రయోగించగల రెండు క్షిపణులను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ క్షిపణులను ఒడిశా తీరంలోని ప్రయోగించారు. భారత సైన్యం కోసం దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్షిపణులు 25 నుంచి 30 కిలోమీటర్ల లక్ష్యాలను సత్వరమే ఛేదిస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఆయుధాలను మోసుకెళ్లడమే కాకుండా ప్రత్యర్థి పక్షం గుర్తించి కూల్చేస్తాయి.