సియోల్: అణ్వాయుధాలను తగ్గించు కోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత బుధవారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని అమెరికా సైన్యం పేర్కొంది. సైనిక సంపత్తిని మరింతగా పెంచుకోనున్నట్లు ఉ.కొరియా ఇలా క్షిపణి ప్రయోగాల ద్వారా చెబుతోందని అమెరికా అభిప్రాయపడింది. సైన్యాన్ని పటిష్టవంతం చేస్తామని పార్టీ సమావేశంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞచేసిన వారం రోజుల్లోనే ఉత్తర జగాంగ్ ప్రావిన్స్‌లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment