► జపాన్ తీరం వైపు ప్రయోగం
► అమెరికాను రెచ్చగొట్టేందుకేనన్న దక్షిణ కొరియా
వాషింగ్టన్ : అమెరికా కూటమిని రెచ్చగొట్టేలా ఉత్తర కొరియా ఆదివారం మరో క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర ప్యాంగాన్ ప్రావిన్స్‌లో జపాన్ తీరంవైపుగా ఈ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా వర్గాలు వెల్లడించాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బాంఘ్యోన్ ఎయిర్‌బేస్ నుంచి నిర్వహించిన ఈ ప్రయోగంలో దాదాపు 5కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి సముద్రంలో పడిపోయిందని తెలిపాయి.
‘నేటి క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసింది’ అని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్ తీరం లక్ష్యంగా జరిగిన ఈ ప్రయోగం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో అమెరికా వందశాతం అండగా నిలుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. ‘ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మిత్రదేశానికి మా మద్దతు 100 శాతం ఉంటుంది’ అని వెల్లడించారు.
ట్రంప్‌కు వార్తాపత్రిక క్షమాపణలు!
ట్రంప్ ఫొటో తప్పుగా ప్రచురించినందుకు డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన ఎల్ నేషనల్ అనే వార్తాపత్రిక క్షమాపణలు చెప్పింది.