రష్యా సైనిక విన్యాసాల్లో పాల్గొన్న పుతిన్‌ | Vladimir Putin Personally Fires Four Ballistic Missiles in Russian Drills | Sakshi
Sakshi News home page

రష్యా సైనిక విన్యాసాల్లో పాల్గొన్న పుతిన్‌

Published Sat, Oct 28 2017 2:55 AM | Last Updated on Sat, Oct 28 2017 2:55 AM

Vladimir Putin Personally Fires Four Ballistic Missiles in Russian Drills

మాస్కో: రష్యా సైన్యం నిర్వహించిన సైనిక విన్యాసాల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొని స్వయంగా నాలుగు ఖండాంతర క్షిపణులను ప్రయోగించారని ఆయన కార్యాలయం వెల్లడించింది. రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలను పరీక్షించేందుకు గురువారం జరిగిన ఈ కసరత్తులో పుతిన్‌ పాల్గొన్నట్లు ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ చెప్పారు.

అణు జలాంతర్గాముల నుంచి మూడు, లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఒకటి చొప్పున మొత్తం నాలుగు ఖండాంతర క్షిపణులను పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కూడా రష్యా ఖండాంతర క్షిపణులతో ఇలాంటి కసరత్తులే నిర్వహించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement