President Vladimir Putin
-
కిరాతకుడికి రష్యా అధ్యక్షుడి క్షమాభిక్ష! సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు..
ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాదు అతన్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపారు. వ్లాదిస్లావ్ కాన్యుస్ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలు వెరా పెక్తెలేవాను అత్యంత కిరాతకంగా చంపాడు. ఇందుకుగానూ అతనికి 17 ఏళ్ల శిక్ష పడగా ఇంకా సంవత్సరం కూడా పూర్తవకముందే అధ్యక్షుడు పుతిన్ అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు బ్రేకప్ చెప్పిందన్న కక్షతో పెక్తెలేవాను కాన్యుస్ అత్యాచారం చేసి, 111 సార్లు కత్తితో పొడిచి, మూడున్నర గంటల పాటు చిత్రవధ చేశాడు. ఆ తర్వాత ఆమె మెడకు కేబుల్ వైర్ బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చాడని ‘ది సన్’ కథనం ద్వారా తెలిసింది. హతాశయురాలైన మృతురాలి తల్లి మృతురాలి తల్లి ఒక్సానా.. సైనిక దుస్తులలో ఆయుధం చేతపట్టి ఉన్న హంతకుడు కాన్యుస్ ఫొటోలను చూసి హతాశయురాలయ్యారు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా హత్య చేసిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి వదిలేయడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. అంతటి కిరాతకుడికి ఆయుధం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, తన కూతురు ఆత్మకు శాంతి చేకూరదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ హంతకుడు బయట ఉంటే తమను కూడా చంపేస్తాడని ఆందళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌కు కాన్యుస్‌ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధ్రువీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా తెలిపారు. ఆమె నవంబర్ 3 నాటి రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లేఖను బయటపెట్టారు. కాన్యుస్‌కు క్షమాభిక్ష లభించిందని, ఏప్రిల్ 27న అధ్యక్షుడి ఆదేశాలతో అతని శిక్షను రద్దు చేసినట్లు ఆ లేఖలో ఉంది. కాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ చర్యను సమర్థించారు. ఉక్రెయిన్‌లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు వారి నేరాలకు "రక్తంతో" ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నట్లు ‘ఏఎఫ్‌పీ’ నివేదించింది. -
రష్యా సైనిక విన్యాసాల్లో పాల్గొన్న పుతిన్
మాస్కో: రష్యా సైన్యం నిర్వహించిన సైనిక విన్యాసాల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొని స్వయంగా నాలుగు ఖండాంతర క్షిపణులను ప్రయోగించారని ఆయన కార్యాలయం వెల్లడించింది. రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలను పరీక్షించేందుకు గురువారం జరిగిన ఈ కసరత్తులో పుతిన్ పాల్గొన్నట్లు ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. అణు జలాంతర్గాముల నుంచి మూడు, లాంచ్‌ప్యాడ్ నుంచి ఒకటి చొప్పున మొత్తం నాలుగు ఖండాంతర క్షిపణులను పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కూడా రష్యా ఖండాంతర క్షిపణులతో ఇలాంటి కసరత్తులే నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ట్రక్కు, స్కూలు బస్సు ఢీ: 12 మంది మృతి
-
ట్రక్కు, స్కూలు బస్సు ఢీ: 12 మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంటి-మాన్సియాక్ హైవేపై స్కూలు బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11మంది చిన్నారులతో సహా 12మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఆటల పోటీల్లో పాల్గొని తిరుగు పయనమైన ఆక్రోబాటిక్స్ జట్టు ప్రయాణిస్తున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల్లో 29 మంది 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు ఉండగా మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. పొగ మంచు దట్టంగా ఉండి దారులు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంటి-మాన్సియాక్లో ఒక రోజు సంతాపదినంగా ప్రకటించారు. -
ప్రపంచం రష్యాను నమ్మట్లేదు: పుతిన్
మాస్కో: పతనమై పాతికేళ్లు కావస్తున్న తరుణంలో యూఎస్ఎస్ఆర్(యూనియన్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్) పునర్మిర్మాణంపై పశ్చిమదేశాలు వ్యక్తంచేస్తున్న అనుమానాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. రష్యా మరోసారి యూఎస్ఎస్ఆర్ ను నిర్మిస్తోందంటూ అమెరికా, యూరప్ అంతటా చలరేగుతున్న పుకార్లను ఆయన ఖండిచారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని బూచిగా చూపెడుతూ తమపై నిరాధార ఆరోపణలుచేస్తున్నారని మండిపడ్డారు. రష్యాపై పశ్చిమదేశాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ పుతిన్ మాట్లాడిన డాక్యుమెంట్.. 'పబ్లిక్ రష్యా' ఛానెల్ లో సోమవారం ప్రసారమైంది. 'మేం యూఎస్ఎస్ఆర్ ను పునర్మించాలనుకోవట్లేదు. దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని ప్రపంచం నమ్మట్లేదు' అని పుతిన్ అన్నారు. తామే సర్వజ్ఞులమని భావించే పశ్చిమదేశాలు.. ప్రపంచంలోని మిగతాదేశాలపై అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రదర్శించే ఆసక్తిలో సగమైనా ఆఫ్రికా, మధ్య ఆసియాలపై కేంద్రీకరించి ఉంటే భూగోళం పరిస్థితి మెరుగైఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రతిదేశానికి తనదైన సంస్కృతి, మతం, వారసత్వాలు ఉంటాయి. దీన్ని రష్యా గుర్తెరిగింది కాబట్టే యూఎస్ఎస్ఆర్ గురించి ఆలోచించట్లేదు. అయితే ఈ నిజాన్ని అమెరికా, యూరప్ దేశాలు ఎన్నటికీ అంగీకరించవన్నారు.