ఢిల్లీ: భారతీయ పౌరులు రష్యా దేశ సైన్యంలో భాగం కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బుధవారం బాబుష్కిన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘భారతీయ పౌరులు రష్యా సైన్యంలో భాగం కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. ఏజెంట్లు మోసం చేయటం వల్ల కొంత మంది టూరిస్టు విసాలపై వచ్చి రష్యా ఆర్మీలో చేరుతున్నారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొని చర్యలు తీసుకుంటాం. ఈ వ్యహారంపై భారత్, రష్యా ఒకే ఆలోచనతో ఉంది. అందుకే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనుకోవటం లేదు.
మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా సైన్యంలో భారత పౌరులు భాగంకావాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు రష్యా అధికారులు సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. చాలా మంది భారతీ పౌరులు కేవలం డబ్బుల కోసమే రష్యా ఆర్మీలో చేరుతన్నారు. అలాంటి వారిని మేము ఎట్టిపరిస్థితుల్లో కూడా చేర్చుకోము. కేవలం 50 నుంచి 100 మంది భారతీయులు మాత్రమే రష్యా సైన్యంలో ఉన్నారు. ఇది అంత ప్రభావం చూపే విషయం కాదు. రష్యా ఆర్మీలో సహయకులుగా చేరుతున్న పలువురు భారతీయులకు సరైన విసాలు కూడా లేవు. చాలా వరకు వారంతా టూరిస్ట్ వీసా మీద రష్యాకు వస్తున్నారు ’’ అని అన్నారు.
ఇది చదవండి: భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్ కీలక నిర్ణయం
ఇక.. రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. రష్యా ఆర్మీలో ఉన్న భారతీయ పౌరులను విడుదల చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు. దీనిపై రష్యా సైతం సానూకూలంగా స్పందిస్తూ.. తమ ఆర్మీలో సహయకులుగా పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment