ఉడీ తరహా దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. మాటలు చెప్పడానికి కంటే చేతల్లో చేసి చూపించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఏదో పొరపాటు కారణంగానే ఉడీ దాడికి అవకాశం ఏర్పడివుంటున్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పొరపాటును సరిదిద్దుకుంటామని, భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామన్నారు.