యూరి దాడి ఘటన హేయమైన చర్య అని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రశాంతతను భంగం కలిగించడమే పాకిస్థాన్ లక్ష్యంగా మారిందన్నారు. వీహెచ్‌పీ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ మన సైన్యాన్ని ఎదుర్కొవటం చేతగాక దొడ్డిదారిలో పొరుగుదేశం దాడులకు పాల్పడుతుందన్నారు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ జేసీ –2 రామస్వామికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టన్న, నగర కార్యదర్శి భానుప్రకాష్, బజరంగ్‌దళ్ రాష్ట్ర ప్రముఖ్ వేద ప్రకాష్, నగర ప్రముఖ్ రామకృష జిల్లా అధ్యక్షుడు నరసింహుడు పాల్గొన్నారు.