kashimir
-
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్ ఫిదా
క్రికెట్‌పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx— Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషానిస్తోందంటూ టూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కశ్మీర్లో ‘జపాన్’ షూటింగ్.. కార్తీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్
పొన్నియిన్ సెల్వన్ – 2 వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. కథ చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్ బాబు, ఏస్సార్ ప్రభు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి అనూ ఇమ్మానుయేల్ కథానాయకగా నటిస్తున్న ఇందులో నటుడు సునీల్, విజయ్ మిల్టన్, వాగై చంద్రశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కాగా చిత్రంలోని ఓ పాటను ఇటీవల కశ్మీర్లో చిత్రీకరించారు. అప్పుడు పలువురు అభిమానులు చూడడానికి చుట్టుముట్టారు. దీంతో కార్తీ వారందరినీ అభిమానంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను కార్తీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ వుతున్నాయి. కాగా కార్తీ నటిస్తున్న 25వ చిత్రం జపాన్. ఇందులో ఆయన దొంగగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా మరోమారు రెచ్చిపోయారు ఉగ్రవాదులు. షోపియాన్ జిల్లాలో కశ్మీరీ పండింట్లే లక్ష్యంగా శనివారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని చౌధరీ గుండ్ ప్రాంతంలో తన ఇంటి సమీపంలోనే పురాన్ క్రిష్ణ భట్ అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు పోలీసు అధికారులు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు.. బాధితుడు భట్‌కు ఇద్దరు 10 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, తాము భయం భయంగా బతుకుతున్నామని ఆయన బంధువు ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల భయంతో భట్ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టేందుకు సైతం భయపడేవాడని చెప్పారు. ఇంతకు ముందు ఆగస్టు 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత కొద్ది రోజులు పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినా.. మరోమారు తూటా పేలటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పండిట్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఇదీ చదవండి: కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి -
దిమ్మతిరిగే ప్రశ్న.. నీళ్లు నమిలిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. చైనాపై మరోసారి తన స్వామిభక్తిని ప్రకటించుకున్నాడు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో చైనా తీరుని ఓ జర్నలిస్ట్ ఎండగట్టగా.. సమాధానం చెప్పలేక ఇమ్రాన్ ఖాన్ నీళ్లు నములుతూ దాటవేత ధోరణిని ప్రదర్శించాడు. చైనా మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోతపై డ్రాగన్ తీరును తప్పుబట్టకపోగా.. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. న్యూయార్క్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను.. హెచ్‌బీవో అక్సియోస్ జర్నలిస్ట్ జోనాథన్ స్వాన్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు చాలానే అడిగాడు స్వాన్. ఇక ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాడాలని ఇస్లాం స్టేట్ నేతలకు కిందటి ఏడాది ఇమ్రాన్ లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించిన స్వాన్.. చైనా విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశాడు. ‘‘మీ పొరుగున పశ్చిమ చైనాలో అక్కడి ప్రభుత్వం పది లక్షల మందికి పైగా ఉయిగుర్లను బంధించి, హింసిస్తోంది. బలవంతంగా వాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయిస్తోంది. క్సింగ్జియాంగ్లో మసీదుల్ని కూలగొట్టింది. రంజాన్ వేళ పవిత్రంగా ఉపవాసం పాటించేవాళ్లను శిక్షించింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్న ఇస్లామోఫోబియాను నిలదీసే మీరు.. పొరుగునే ఉన్న చైనాను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు..ఆధారాలున్నా.. అవకాశాలు దొరుకుతున్న నిలదీయలేక ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని అడిగాడు స్వాన్. Pakistan Prime Minister Imran Khan asks @jonathanvswan why the West focuses on the genocide of Muslims in China's Xinjiang province and not the atrocities in Kashmir. Khan: "Why are the people of Kashmir ignored? It is much more relevant.” #AxiosOnHBO pic.twitter.com/jTeXrKKEgv — Axios (@axios) June 21, 2021 అయితే ఇది అప్రస్తుతమైన అంశమని, విపత్కర పరిస్థితుల్లో పాక్‌ను ఆదుకున్న చైనాతో తమకు గాఢమైన స్నేహం ఉందని, నాలుగు గోడల మధ్యే ఏ విషయమైనా మాట్లాడుకుంటామని ఇమ్రాన్ తెలిపాడు. అయితే ఇది అంత తీవ్రమైన సమస్య కాదని భావిస్తున్నారా? అని స్వాన్ అడగ్గానే.. కశ్మీర్లో లక్షల మంది భారతీయ సైన్యంలో ఉన్నారని, ఇది అంతకంటే తీవ్రమైన విషయమని విషయాన్ని ట్రాక్ తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, స్వాన్ మాత్రం వదల్లేదు. ఆధారాలున్నాయని, అంత స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించగా.. ఏది ఉన్నా నాలుగు గోడల మధ్యే మాట్లాడుకుంటామని మరోసారి ఉద్ఘాటించి.. విషయాన్ని అక్కడితోనే ముగించాడు పాక్ ప్రధాని. చదవండి: వికటించిన పాక్ మామిడి దౌత్యం! -
‘అతనికే బతికే అర్హత లేకపోతే.. ఇక ఎవరికుంది?’
కశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ జర్నలిస్టు, ‘రైజింగ్ కశ్మీర్’ పత్రిక సంపాదకుడు షుజత్ బుఖారీ మరణించి నేటికి సరిగ్గా ఏడాది. షుజత్ మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు. నేటికి కూడా ఆయన లేడనే వార్తను చాలా మంది నమ్మలేకపోతున్నారు. షుజత్ బుఖారీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య డాక్టర్ తహ్మీనా బుఖారీ తన భర్త రాసిన వ్యాసాలను ‘కశ్మీర్స్ థిన్ రెడ్‌లైన్స్ ఇన్ శ్రీనగర్’ పేరిట ఓ సంకలనంగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన భర్తను తల్చుకోని భావోద్వేగానికి గురయ్యారు తహ్మీనా. ఆమె మాటల్లోనే.. ‘తను(షుజత్ బుఖారీ) మరణించాక నా జీవితం చాలా కష్టంగా మారింది. తన చావు నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. తన గురించి ఆలోచించినప్పుడల్లా.. నాకు ఎల్లా వేళలా తోడుగా నిలిచే మనిషి నేడు నన్ను విడిచి వెళ్లాడని గుర్తుకొస్తుంది. అలా అనిపించగానే నా గుండె బరువెక్కుతుంది. ఇప్పుడా మనిషి మా మధ్య ఉంటే.. తన పిల్లలకు గైడ్‌గా మారి.. ఈ ప్రపంచంతో ఎలా మెలగాలో చెబుతుండేవాడు. తను ఇక లేడు.. ఎన్నటికి తిరిగి రాడు. నీ భర్తను ఎందుకు చంపారని జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు. సాధరణంగా నాకు నేనే ఎన్నో సార్లు ఈ విషయం గురించి ప్రశ్నించుకొన్నాను. కానీ నాకు సమాధానం దొరకలేదు. అయితే ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యం కల్గుతుంటుంది. షుజత్ బుఖారీ లాంటి ఓ వ్యక్తిని బతకడాని వీల్లేదని చంపేస్తే.. ఇక ఈ భూమ్మిద బతికే హక్కు ఎవరికుంటుంది అని ఆశ్చర్యపోతుంటాను’ అన్నారు. ‘తనను చంపడానికి ఎన్నో సిద్ధాంతాలున్నాయి. కానీ నా దగ్గర సమాధానం మాత్రం లేదు. ఇదంతా జరిగిపోయింది. నా భర్త చనిపోయాడు.. తననేవరు తిరిగి తీసుకురాలేరు. నాకు దేవుడు ఇచ్చే తీర్పే అన్నింటికంటే ఉన్నతమైనది. తను పై నుంచి ప్రతి దాన్ని చూస్తుంటాడు. నా భర్త విషయంలో దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నాకా నమ్మకం ఉంది. షుజత్ను ఓ గొప్ప తండ్రిగా.. భర్తగా గుర్తు చేసుకుంటాను.. తనతో గడిపిన అందమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటాను. తనొక జర్నలిస్ట్‌గా, శ్రేయోభిలాషిగా, స్నేహితుడిగా మాత్రమే జనాలకు తెలుసు. కానీ నేను తనలో ఉన్న మరో కోణాన్ని త్వరలోనే జనాల ముందు ఆవిష్కరిస్తాను. ఓ పుస్తకం రూపంలో తనలోని మరో గొప్ప వ్యక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. తను వదిలి వెళ్లిన ఆశయాలను పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం’ అన్నారు. ‘ఈ వ్యాస సంకలనాన్ని షుజత్ నిర్మించిన సంస్థకు.. అతని పిల్లలకు అంకితం ఇస్తున్నాను. తనతో పని చేసే వారిలో షుజత్ ఆత్మవిశ్వాసాన్ని మెండుగా నింపాడు. భయం లేని జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాడు. షుజత్ లేడు.. ఇక రైజింగ్ కశ్మీర్ పని కూడా ముగిసి పోతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ దీన్ని అబద్దమని నిరూపిస్తాం. ఇక ఈ ‘కశ్మీర్స్ థిన్ రెడ్ లైన్స్ ఇన్ శ్రీనగర్’ సంకలనం షుజత్ ఆలోచనలకు ప్రతిరూపం. తన అభిప్రాయాలకు.. ఆసక్తులకు.. సంబంధించినవే కాక తనకు విలువైనవిగా అనిపించిన విషయాలను కూడా ఇందులో ప్రస్తావించాడు’ అన్నారు. -
యూరి దాడి ఘటనపై ఆగ్రహజ్వాల
కర్నూలు : యూరి దాడి ఘటన హేయమైన చర్య అని విశ్వహిందూ పరిషత్తు (వీహెచ్‌పీ)రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి అన్నారు. భారతసైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్ర పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్‌షరీఫ్ దిష్టిబొమ్మ ను దహనం చేసి నిరసన తెలి పారు. ఈ సందర్భంగా నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రశాంతతను భంగం కలిగించడమే పాకిస్థాన్ లక్ష్యంగా మారిందన్నారు. వీహెచ్‌పీ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ మన సైన్యాన్ని ఎదుర్కొవటం చేతగాక దొడ్డిదారిలో పొరుగుదేశం దాడులకు పాల్పడుతుందన్నారు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ జేసీ –2 రామస్వామికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టన్న, నగర కార్యదర్శి భానుప్రకాష్, బజరంగ్దళ్ రాష్ట్ర ప్రముఖ్ వేద ప్రకాష్, నగర ప్రముఖ్ రామకృష జిల్లా అధ్యక్షుడు నరసింహుడు పాల్గొన్నారు.