కశ్మీర్‌లో ‘జపాన్‌’ షూటింగ్‌.. కార్తీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్‌ | Karthi's Click With Fans From 'Japan' Movie Shooting Spot - Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ‘జపాన్‌’ షూటింగ్‌.. కార్తీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్‌

Published Tue, Aug 29 2023 10:26 AM | Last Updated on Tue, Aug 29 2023 10:29 AM

karthi Click With Fans From Japan Shooting Spot - Sakshi

పొన్నియిన్‌ సెల్వన్‌ – 2 వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్‌. కథ చిత్రాల దర్శకుడు రాజు మురుగన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్సార్‌ ప్రకాష్‌ బాబు, ఏస్సార్‌ ప్రభు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి అనూ ఇమ్మానుయేల్‌ కథానాయకగా నటిస్తున్న ఇందులో నటుడు సునీల్‌, విజయ్‌ మిల్టన్‌, వాగై చంద్రశేఖర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని, రవి వర్మన్‌ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది.

కాగా చిత్రంలోని ఓ పాటను ఇటీవల కశ్మీర్లో చిత్రీకరించారు. అప్పుడు పలువురు అభిమానులు చూడడానికి చుట్టుముట్టారు. దీంతో కార్తీ వారందరినీ అభిమానంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను కార్తీ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ వుతున్నాయి. కాగా కార్తీ నటిస్తున్న 25వ చిత్రం జపాన్‌. ఇందులో ఆయన దొంగగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement