సినీ పరిశ్రమలో సర్దుకుపోవడం (కాస్టింగ్ కౌచ్) అనే పదం ఇటీవల మళ్లీ ఎక్కువగా వినిపిస్తోంది. నటి అను ఇమ్మానుయేల్ కూడా అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాను అని పేర్కొంది. చదువుకునే రోజుల్లోనే బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత 2016లో నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయింది. ఆ తర్వాత 2016లోనే 'నాని' కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంలో కిరణ్మై పాత్రలో మెప్పించింది.
ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సరసన 'నమ్మవీట్టు పిళ్లై' చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం తర్వాత అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఆ చిత్రం విజయాన్ని సాధించిన అను ఇమ్మానుయేల్‌ను మాత్రం అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా అజ్ఞాతవాసి,నా పేరు సూర్య,గీత గోవిందం వంటి సినిమాలు చేసినా ఈ అమ్మడిని ఎప్పటికీ స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పాలి.
తాజాగా కార్తీక్ జంటగా 'జపాన్' చిత్రంలో నటించింది. త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సర్దుకుపోవడం అనే అంశంపై స్పందిస్తూ. అను ఇమ్మానుయేల్ తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే ఇలాంటి ఘటనలను కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment