Karthi 25th Update: Actor Karthi Japan Movie First Look Poster Goes Viral - Sakshi
Sakshi News home page

Japan First Look Poster: మేడ్‌ ఇన్‌ ఇండియా!

Published Tue, Nov 15 2022 3:57 AM | Last Updated on Tue, Nov 15 2022 9:46 AM

Karthi Japan First Look poster release - Sakshi

బంగారు చొక్కా, మెడలో బంగారు గొలుసు, ఒక చేతిలో బంగారు తుపాకీ, మరో చేతిలో గోల్డెన్‌ గ్లోబ్‌... ఇదీ హీరో కార్తీ కొత్త గెటప్‌. ఇదంతా ‘జపాన్‌’ సినిమా కోసమే. కార్తీ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. రాజు మురుగన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, విజయ్‌ మిల్టన్‌ నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. అయితే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కార్తీ రెండు గెటప్‌లతో కనిపిస్తుండటం విశేషం. ‘‘ఓ చమత్కారమైన వ్యక్తి పాత్రలో నటిస్తూ ఓ కొత్త సినిమా జర్నీని స్టార్ట్‌ చేయడం ఆసక్తికరంగా ఉంది. జపాన్‌: మేడ్‌ ఇన్‌ ఇండియా’’ అని పేర్కొన్నారు కార్తీ. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, డీవోపీ: రవివర్మన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement